క్వాలిఫయిర్-2: ఫైనల్‌లో పూణెతో తలపడెదెవరో?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో టైటిల్ పోరుకు ముందు జరిగే క్వాలిఫయిర్-2 మ్యాచ్ కీలకంగా మారింది. బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో జరగనున్న ఈ క్వాలిఫయిర్-2 మ్యాచ్‌లో ఐపీఎల్ మాజీ విజేతలైన ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి.

ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఆదివారం హైదరాబాద్‌‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ ఫైనల్స్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉన్న ముంబై క్వాలిఫయర్‌-1లో పూణేతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది.

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా విజయం

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా విజయం

ఇక ఐపీఎల్ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో కోల్‌కతా విజయం సాధించి మంచి జోరు మీద ఉంది. ఇక లీగ్ దశలో ముంబై, కోల్‌కతా రెండు సార్లు తలపడగా రెండింట్లోనూ ముంబై పైచేయి సాధించింది. ముంబై ఓపెనర్లలో పార్థివ్‌ పటేల్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, లెండిల్‌ సిమన్స్‌ కూడా సత్తా చాటుతున్నాడు.

మిడిల్‌ ఆర్డర్‌పై ఒత్తిడి తగ్గిస్తున్న పటేల్‌, సిమన్స్

మిడిల్‌ ఆర్డర్‌పై ఒత్తిడి తగ్గిస్తున్న పటేల్‌, సిమన్స్

వీరిద్దరూ తమ ఆటతో జట్టుకు శుభారంభాలను అందించి మిడిల్‌ ఆర్డర్‌పై ఒత్తిడిని తగ్గిస్తున్నారు. ఆ తర్వాత కెప్టెన్‌ రోహిత్ శర్మ, అంబటి రాయుడు, పొలార్డ్‌ జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళుతున్నారు. హార్దిక్, కృనాల్‌ పాండ్యాలు ఆల్‌రౌండ్ ప్రతిభతో కఠిన సమయాల్లో జట్టును ఆదుకుంటున్నారు. ఇక బౌలింగ్‌లో మలింగ, మెక్లీనగన్, బుమ్రా చెలరేగిపోతున్నారు.

సునీల్ నరేన్ మెరుపులు మెరిపిస్తాడేమో

సునీల్ నరేన్ మెరుపులు మెరిపిస్తాడేమో

ఇక కోల్‌కతా విషయానికి వస్తే క్రిస్‌ లిన్‌తో కలిసి ఓపెనర్లు గంభీర్, నరైన్, ఉతప్ప అద్భుతంగా ఆడుతున్నారు. ఈ సీజన్‌లో ఓపెనింగ్ హిట్టర్‌గా నరైన్‌ ఫామ్‌లో ఉన్నాడు. 15 బంతుల్లో అర్ధసెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. బౌలింగ్‌ విభాగంలో ఉమేశ్‌ యాదవ్‌ ఇప్పటికే 16 వికెట్లు తీశాడు. కూల్టర్‌నీల్‌ కీలక సమయంలో వికెట్లు తీసి జట్టును ఆదుకుంటున్నాడు. వెన్నుముక గాయం కారణంగా మనీశ్‌ పాండే ఈ మ్యాచ్‌కి దూరమయ్యాడు.

ఇరు జట్లు రెండుసార్లు టైటిల్ గెలిచిన అనుభవం

ఇరు జట్లు రెండుసార్లు టైటిల్ గెలిచిన అనుభవం

ఇక ఈ రెండు జట్లు ఇప్పటికే రెండు సార్లు టైటిల్ గెలిచిన అనుభవం ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది. కానీ.. గతంతో పోలిస్తే చిన్నస్వామి స్టేడియం పిచ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు బ్యాట్స్‌మెన్‌కి స్వర్గధామంగా చెప్పుకునే ఈ పిచ్‌పై ప్రస్తుతం బౌలర్లు సత్తా చాటుతున్నారు.

వర్షం పడే సూచనలు కూడా

వర్షం పడే సూచనలు కూడా

మ్యాచ్ జరుగుతున్న సమయంలో బంతి స్లో అవుతూ.. బౌన్స్ బాగా తగ్గిపోతోంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కూడా ఛేదనకు దిగిన కోల్‌కతా తొలి 7 బంతుల్లోనే మూడు టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోవడమే దీనికి నిదర్శనం. వర్షం కారణంగా మ్యాచ్‌ని కుదించడంతో కోల్‌కతా నెగ్గింది లేదంటే 129 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి తీవ్రంగా శ్రమించేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two-time champions Kolkata Knight Riders (KKR) would be eager to avenge their twin defeats in the league stage when they face old foes Mumbai Indians (MI) in the IPL 2017 Qualifer 2 here tomorrow (May 19).
Please Wait while comments are loading...