మరో నాలుగు జట్లు: 12 జట్లతో ప్రొ కబడ్డీ, 13 వారాల పాటు లీగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వేసవి వచ్చిందంటే చాలు క్రికెట్ అభిమానులకు పండుగే. నలభై ఐదు రోజుల పాటు ఐపీఎల్ అభిమానులకు వినోదాన్ని పంచుతుంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత అత్యంత ఆదరణ పొందిన ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) కూడా ఈ ఏడాది భారీ ప్రణాళికను సిద్ధం చేసుకుంది.

ఇందులో భాగంగా ఈ ఏడాది లీగ్‌లో 12 జట్ల మధ్య టైటిల్‌ సమరం జరగనుంది. తాజాగా పీకేఎల్‌‌లో మరో నాలుగు జట్లకు అవకాశం లభించింది. ఈ లీగ్‌లో ప్రస్తుతం హైదరాబాద్‌, బెంగుళూరు, ముంబై, పుణె, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్‌, పాట్నా జట్లు ఆడుతున్న సంగతి తెలిసిందే.

 Pro Kabaddi League set to add four new franchises for fifth season

తాజాగా వచ్చే సీజన్ నుంచి తమిళనాడు, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన జట్లు పాల్గొననున్నాయి. దీంతో లీగ్‌లో మొత్తం జట్ల సంఖ్య 12 పెరిగిందని, రానున్న కాలంలో జట్ల సంఖ్యను మరింత పెంచనున్నట్లు స్టార్ ఇండియా సీఈవో ఉదయశంకర్ తెలిపారు. జట్ల సంఖ్య పెరగడంతో 13 వారాల పాటు ప్రేక్షకులను అలరించనుంది.

ప్రో కబడ్డీ లీగ్ ఐదో సీజన్ జూన్‌లో ప్రారంభం కానుంది. 13 వారాల పాటు 130 కి పైగా మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా 2014లో ఆరంభమైన ప్రొ కబడ్డీకి మంచి ఆదరణ లభించింది. మన గ్రామీణ క్రీడ కబడ్డీ. పీఏకెఎల్ ద్వారా కబడ్డీ క్రీడాకారులకు క్రికెటర్ల స్థాయిలో ఆదరణ లభించడం విశేషం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Read in English: PKL to add four new teams
English summary
Pro Kabaddi League (PKL) is all set to add four new teams to the already existing eight to make it a twelve-team affair for the upcoming fifth season in July. PKL, as a result, has invited Expression of Interest for up to four new teams across Tamil Nadu, Gujarat, Uttar Pradesh, Haryana, a media release from the league said on Wednesday (March 29).
Please Wait while comments are loading...