దేశం విడిచి వెళ్లొద్దు: ఆ ఐదుగురు క్రికెటర్లకు పాక్ ఆదేశం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి సస్పెండ్‌కు గురైన ఐదుగురు క్రికెటర్లు దేశం దాటొద్దని పాకిస్థాన్‌ ప్రభుత్వం ఆదేశించింది. పీఎస్ఎల్ లీగ్‌లో పాకిస్థాన్ జాతీయ క్రికెటర్లు షర్జీల్‌ ఖాన్‌, ఖలీద్‌ లతీఫ్‌, మహ్మద్‌ ఇర్ఫాన్‌, షాజైబ్‌ హసన్‌, నాసిర్‌ జెంషెడ్‌ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు.

దీంతో ఈ ఐదుగురిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాదు వారు ఏ ఫార్మెట్‌లో కూడా ఆడకూడదని హెచ్చరించింది. ప్రస్తుతం నాసిర్ జెంషెడ్‌ బ్రిటన్‌లో ఉన్నారు. పీఎస్ఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని తొలుత ఆరోపణలు వచ్చింది ఇతడిపైనే.

PSL spot-fixing: Pakistan bars 5 cricketers from leaving country

దీంతో స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో మొదట ఐసీసీ యాంటీ కరప్షన్ అధికారులు ఇతడినే అరెస్ట్ చేశారు. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇప్పటికే ఇర్ఫాన్‌, లతీఫ్‌‌లు లాహోర్‌లోని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ముందు వాంగ్మూలాలు ఇచ్చారని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి చెప్పారు.

మరోవైపు హసన్‌, షర్జీల్‌ ఖాన్‌లు మంగళవారం (మార్చి 21)న విచారణ కమిషన్‌ ఎదుట హాజరు కానున్నారు. స్పాట్ ఫిక్సింగ్ కేసును విచారించడానికి రిటైర్డ్‌ న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య ట్రైబ్యునల్‌ను పాకిస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

పీఎస్ఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు గాను ఈ ఐదుగురిపై పీసీబీ సస్పెన్షన్ వేటు వేసింది. పీసీబీ ఛైర్మన్ ఖాన్ కూడా క్రికెట్‌లో ఫిక్సింగ్ వ్యవహారాలను సహించేది లేదని కుండబద్దలు కొట్టారు. ఈ కేసులో క్రికెటర్లు వివరణ ఇచ్చేందుకు వారికి 14 రోజుల సమయమిచ్చినట్లు ఆయన తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Pakistan government has barred the five cricketers involved in alleged spot-fixing from leaving the country.
Please Wait while comments are loading...