మొత్తం నలుగురు: మరో పాక్ ఆటగాడిని సస్పెండ్ చేసిన పీసీబీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి సస్పెన్షన్‌కు గురైన ఆటగాళ్ల సంఖ్య నాలుగుకి చేరింది. తాజాగా శుక్రవారం స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు గాను పాకిస్ధాన్ బ్యాట్స్‌మెన్ షహజ్బ్ హసన్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సస్పెండ్ చేసింది. ఈ మేరకు పీసీబీ అధికారిక ప్రకటన చేసింది.

పాక్ క్రికెట్‌లో అలజడి: స్ఫాట్ ఫిక్సింగ్, ఇద్దరు ఆటగాళ్లపై వేటు

పీఎస్ఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ పాల్పడినందుకు హసన్‌ను సస్పెండ్ చేయడంతోపాటు అతడిపై చార్జిషీటు నమోదుకు కూడా పీసీబీ ఆదేశించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు అతడికి బోర్డు 14 రోజుల గడువు ఇచ్చింది. 2.1.4, 2.4.4, 2.4.5 కోడ్ ఆర్టికల్స్‌ను ఉల్లంఘించినందుకు అతడిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.

PSL spot-fixing scandal: Another Pakistani cricketer suspended

హాసన్ కేసులో త‌మ విచార‌ణ కొన‌సాగుతుంద‌ని పీసీబీ స్ప‌ష్టంచేసింది. ఇంతక ముందు ఇదే ఆరోపణల కింద పాకిస్థాన్ జట్టు ఆటగాళ్లు ఖలీద్ లతీఫ్, షర్జిల్ ఖాన్, మొహమ్మద్ ఇర్ఫాన్‌లను పీసీబీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పీసీబీ సస్పెన్షన్ విధించిన నలుగురు ఆటగాళ్లు కూడా పాకిస్థాన్ జాతీయ జట్టుకు ఆడిన ఆటగాళ్లు కావడం విశేషం.

ఓపెనర్ షర్జిల్ ఖాన్‌ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాక్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు ఆస్ట్రేలియా పర్యటనలో పాక్ తరుపున సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడు కూడా షర్జిల్ ఖానే. పాకిస్థాన్ జట్టు తరుపున ఇప్పిటి వరకు 25 వన్డేలు, 15 ట్వంటీ 20లు ఆడాడు.

ఇక లతిఫ్ విషయానికి వస్తే గతేడాది ఐసీసీ వరల్డ్ టీ20లో పాక్ ఆడిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. పాక్ తరుపున ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడిన లతిఫ్, 13 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఈ ఇద్దరూ ఆటగాళ్లు ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ఖలీద్ ఓపెనింగ్ మ్యాచ్ ఆడలేదు. షర్జీల్ మాత్రం చాలా ఛీప్‌గా ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై కామెంట్ చేసేందుకు పీఎస్ఎల్ ఛైర్మన్ నజామ్ సేథీ నిరాకరించారు. ఆటలో అవినీతి తావు లేదని చెప్పేందుకు, స్ఫాట్ ఫిక్సింగ్‌పై విచారణ జరిపించి ఆటగాళ్లపై వేటు వేశామన్నారు.

స్ఫాట్ ఫిక్సింగ్, అవినీతి ఆరోపణల్లో పాకిస్థాన్ ఆటగాళ్లు దొరికిపోవడం ఇదే మొదటిసారి కాదు. 2010 ఇంగ్లాండ్ పర్యటనలో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ అమీర్, సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్‌లపై ఐదేళ్ల పాటు నిషేధం విధించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pakistan batsman Shahzaib Hasan today (March 17) became the 4th player to be provisionally suspended and charge sheeted relating to the spot-fixing scandal in the Pakistan Super League (PSL).
Please Wait while comments are loading...