మిడిల్ సెషన్ వల్లే: పుజారా, సాహా భాగస్వామ్యంపై కోహ్లీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జడేజా మైదానంలో గన్ లాంటోడని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కితాబిచ్చాడు. భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రాంచీ వేదికగా జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.

నలబై ఓవర్లపాటు బౌలింగ్ వేసి 50 పరుగులు మాత్రమే ఇచ్చాడని, ఇంత పొదుపుగా బౌలింగ్ వేసిన వారిని తాను చూడలేదని కోహ్లీ అన్నాడు. జడేజా ఒకే స్థానంలో పదే పదే బంతులు వేయగలడని, తన బలాలు, పరిమితులు బాగా తెలుసుకుని హార్డ్‌వర్క్ చేస్తాడని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో తాము మంచి క్రికెట్ ఆడామని, తమ వంద శాతం ప్రదర్శన చేశామని అన్నాడు. తన దృష్టిలో పుజారా అమూల్యమైన ఆటగాడని, చాలా మంది అతని విలువను గుర్తించలేకపోవడం తనకు బాధ కలిగిస్తోందని కోహ్లీ అన్నాడు. రాంచీ టెస్టులో అశ్విన్, జడేజా సీజన్‌లో చెరో 4 వేలకు పైగా బంతులు విసిరారని తెలిసి చాలా ఆశ్చర్యపోయానన్నాడు.

కానీ టెస్టుల్లో ఇలాంటివ సర్వసాధారణం. జట్టు గెలవాలంటే అలాంటి విలువైన బౌలర్లను పూర్తిగా వాడుకోవాల్సిందేని కోహ్లీ చెప్పాడు. రాహుల్, మురళీ విజయ్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారని అన్నాడు. కానీ వీరిద్దరి కంటే పుజారా, సాహా నెలకొల్పిన భాగస్వామ్యం తాను చూసిన ఇన్నింగ్స్‌ల్లో అత్యుత్తమైనదిగా అభివర్ణించాడు.

ఆస్ట్రేలియాతో కీలకమైన టాస్ కోల్పోయిన తర్వాత 150 పరుగుల ఆధిక్యం సాధిస్తామని అస్సలు ఊహించలేని కోహ్లీ అన్నాడు. రాంచీ టెస్టులో పుజారా తర్వాత ఎక్కువగా ఆకట్టుకుంది రవీంద్ర జడేజానే. తొలి ఇన్నింగ్స్‌లో 54 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో పాటు ఐదు వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో జడేజా నాలుగు వికెట్లు తీశాడు.

44 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన జడేజా

44 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన జడేజా

రెండో ఇన్నింగ్స్లో మొత్తం 44 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన జడేజా 54 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. మరోవైపు మిడిల్‌ సెషన్‌లో పిచ్‌ నుంచి బౌలర్లకు సహకారం లభించనందు వల్లే మూడో టెస్టులో విజయం సాధించలేకపోయామని కోహ్లీ అన్నాడు.

భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన షాన్‌మార్ష్‌, పీటర్స్‌ హ్యాండ్స్‌కోంబ్‌

భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన షాన్‌మార్ష్‌, పీటర్స్‌ హ్యాండ్స్‌కోంబ్‌

భోజన విరామం కన్నా ముందు వికెట్లను తీయలేకపోయామని, ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ షాన్‌మార్ష్‌, పీటర్స్‌ హ్యాండ్స్‌కోంబ్‌లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారని అన్నాడు. నాలుగోరోజూ చివర్లో బంతి బాగానే తిరిగిందని అయితే శనివారం ఉదయం కూడా స్పిన్‌ చక్కగా తిరిగిందని కోహ్లీ చెప్పాడు.

మిడిల్‌ సెషన్‌ వల్లే మ్యాచ్ మలుపు తిరిగింది

మిడిల్‌ సెషన్‌ వల్లే మ్యాచ్ మలుపు తిరిగింది

కొత్త బంతి తీసుకున్న తర్వాత రెండు వికెట్లు తీయగలిగామని, అయితే సమస్య అంతా మిడిల్‌ సెషన్‌లోనే వచ్చిందని కోహ్లీ పేర్కొన్నాడు. నిజానికి తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ తీయడం చాలా కష్టం. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా డ్రా కోసం ప్రయత్నించి విజయం సాధించిందని కోహ్లీ అన్నాడు.

600 వరకూ స్కోరు చేయడం చాలా కష్టం

600 వరకూ స్కోరు చేయడం చాలా కష్టం

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 451 పరుగులు చేసింది. నాలుగోరోజు ఆట ప్రారంభమయ్యేసరికి మేం 328/6 పరుగులతో ఉన్నాం. అక్కడి నుంచి 600 వరకూ స్కోరు చేయడం చాలా కష్టం. అయితే, జట్టు విజయం సాధించే దిశగా నడిపించామని కోహ్లీ అన్నాడు. కాగా రాంచీ టెస్టు డ్రాగా ముగియడంతో టెస్టు సిరిస్ 1-1తో సమమైంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India captain Virat Kohli was today effusive in his praise for Cheteshwar Pujara and Wriddhiman Saha's record 199-run stand, saying that it was the "best" partnership he has ever seen.
Please Wait while comments are loading...