హ్యాపీ బర్త్‌డే టు ద్రవిడ్: పాఠకుల కోసం అరుదైన చిత్రాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భారత క్రికెట్‌కు బీసీసీఐ అందించిన అత్యుత్తమ ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ ఒకరు. టీమిండియాకు 16 ఏళ్ల పాటు సేవలందించిన రాహుల్ ద్రవిడ్‌ను అభిమానులు ముద్దుగా ద వాల్, మిస్టర్ డిపెండ‌బుల్, కెప్టెన్ కూల్‌గా పిలుచుకుంటారు. బుధవారం ద్రవిడ్ తన 44వ పుట్టిన‌రోజును జరుపుకుంటున్నాడు.

ఈ సందర్భంగా మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు ద్రవిడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ద్రవిడ్ మొత్తం 24,208 ప‌రుగులు నమోదు చేశాడు. క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆరో బ్యాట్స్‌మ‌న్‌గా రికార్డు నమోదు చేశాడు.

టెస్టుల్లో 13288 రన్స్ చేశాడు. అందులో 36 సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 86 అర్ధసెంచరీలు చేసిన ద్రవిడ్ 2003 నుంచి 2007 వరకు టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టాడు. వన్డే ఫార్మాట్‌లో అత్య‌ధిక అర్ధ సెంచ‌రీలు చేసిన‌వారిలో నాలుగోస్థానంలో ఉన్నాడు.

2007 వరల్డ్ కప్ తొలి రౌండ్లోనే టీమిండియా ఇంటిదారి పట్టడంతో ఆ తర్వాత కెప్టెన్సీకి రాజీనామా చేసి ప్లేయర్‌గా కొనసాగాడు. రిటైరైన తర్వాత టీమిండియా కోచ్ పదవితోపాటు కొన్ని కీలక బాధ్యతలు ఇవ్వడానికి బీసీసీఐ సిద్ధంగా ఉన్నా ద్రవిడ్ వాటిని స్వీకరించలేదు.

ప్రస్తుతం ఇండియా ఏ కోచ్‌గా యువ క్రికెటర్లకు మెరుగులు దిద్దుతూ భారత క్రికెట్‌కు మార్గదర్శిగా నిలుస్తున్నాడు. భారత క్రికెట్‌కు 16 ఏళ్లపాటు సేవలందించిన ద్రవిడ్ క్రీడా జీవితంలోని కొన్ని మైలురాళ్లు మీకోసం:

లార్డ్స్ మైదానంలో అరంగేట్రం

లార్డ్స్ మైదానంలో అరంగేట్రం

టెస్టుల్లో సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌లు ఒకేసారి క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో అరంగేట్రం చేశారు. అరంగేట్రం టెస్టులో గంగూలీ సెంచరీ చేయగా, రాహుల్ ద్రవిడ్ 95 పరుగులు చేశాడు.

భారత క్రికెట్‌కు ఐదు పిల్లర్లు

భారత క్రికెట్‌కు ఐదు పిల్లర్లు


ఇండియన్ క్రికెట్‌కు ఐదురుగు పిల్లర్లుగా భావించే అనిల్ కుంబ్లే, సౌరభ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో రాహుల్ ద్రవిడ్

రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్

రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న రాహుల్ ద్రవిడ్. 2013లో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ అవార్డుని స్వీకరించాడు.

ఐసీసీ టెస్టు, ఐసీసీ ప్లేయర్ అవార్డులు


2004లో ఐసీసీ ప్రకటించిన ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని రాహుల్ ద్రవిడ్ సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న తొలి భారత క్రికెట్ ద్రవిడ్.

చిన్నారులతో రాహుల్ ద్రవిడ్

చిన్నారులతో రాహుల్ ద్రవిడ్


భువనేశ్వర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాహుల్ ద్రవిడ్ చిన్నారులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తున్న సందర్భం.

ఫ్యాన్స్‌తో పుట్టినరోజు

ఫ్యాన్స్‌తో పుట్టినరోజు


తన పుట్టినరోజు నాడు అభిమానులు తీసుకొచ్చిన కేక్‌ను కట్ చేస్తున్న రాహుల్ ద్రవిడ్

ఐపీఎల్ 100కు పైగా టీ20 మ్యాచ్‌లు

ఐపీఎల్ 100కు పైగా టీ20 మ్యాచ్‌లు


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లకు కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. 109 టీ20 మ్యాచ్ లాడిన 2586 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో ద్రవిడ్ దూకుడు

ఐపీఎల్‌లో ద్రవిడ్ దూకుడు


ఐపీఎల్ 6వ సీజన్‌లో కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో రాజస్ధాన్ రాయల్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్న ద్రవిడ్ కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గంభీర్ తో కాస్తంత దూకుడుగా వ్యవహరించాడు.

విదేశీ ఆటగాళ్లతో

విదేశీ ఆటగాళ్లతో


కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా జేమ్స్ ఫల్కనర్‌తో రాహుల్ ద్రవిడ్

నలుగురు దిగ్గజ ఆటగాళ్లు ఒకే ఫ్రేమ్‌లో

నలుగురు దిగ్గజ ఆటగాళ్లు ఒకే ఫ్రేమ్‌లో


క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆటో బయోగ్రఫీ సందర్భంగా ఒకే ఫ్రేమ్‌లో నలుగురు దిగ్గజ ఆటగాళ్లు.

సలీం దుర్రానీతో ద్రవిడ్

సలీం దుర్రానీతో ద్రవిడ్


టీమిండియా మాజీ క్రికెటర్ సలీం దుర్రానీతో రాహుల్ ద్రవిడ్.

సర్ వివ్ రిచర్డ్స్‌తో రాహుల్ ద్రవిడ్

సర్ వివ్ రిచర్డ్స్‌తో రాహుల్ ద్రవిడ్


జైపూర్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ప్రాక్టీస్ సందర్భంగా వెస్టిండిస్ లెజెండరీ క్రికెటర్ సర్ వివ్ రిచర్డ్స్‌తో రాహుల్ ద్రవిడ్.

కోహ్లీకి సలహాలు

కోహ్లీకి సలహాలు


చెన్నైలోని చిదంబరం స్టేడియంలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి సూచనలు, సలహాలిస్తున్న రాహుల్ ద్రవిడ్

కోల్ కతాలో అద్భుత ఇన్నింగ్స్

కోల్ కతాలో అద్భుత ఇన్నింగ్స్


భారత క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో భాగస్వామి అయిన రాహుల్ ద్రవిడ్. ఆస్ట్రేలియాతో కోల్ కతాతో ఈడెన్ గార్డెన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ 376 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలో వీరిద్దిరి పేరు లిఖించబడింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
One of the finest players of Indian cricket Rahul Dravid turned 44 on Wednesday (Jan 11). In his 16-year long cricketing career, the former classical batsman from India was given several nicknames such as 'The Wall', 'Mr Dependable and 'Captain Cool'.
Please Wait while comments are loading...