మరో రెండేళ్లు: రాహుల్ ద్రవిడ్‌ కోచ్‌గా సీఏసీ గ్రీన్ సిగ్నల్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇండియా ఏ, అండర్-19 జట్టు కోచ్‌గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ తొలుత 10 నెలల పాటు అండర్-19 జట్టు కోచ్‌గా ఉండేందుకు ద్రవిడ్‌తో ఒప్పందం చేసుకుంది.

అయితే ద్రవిడ్ పదవీ కాలం ముగుస్తుండటంతో మంగళవారం ఈ ఒప్పందాన్ని రెండేళ్లపాటు పొడిగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా హెడ్ కోచ్ కోసం ఇంటర్యూలు నిర్వహించే క్రికెట్ సలహా కమిటీ అండర్‌-19 కోచ్‌ కోసం కూడా ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ద్రవిడ్ పదవీ కాలం రెండేళ్లు పెంపు

ద్రవిడ్ పదవీ కాలం రెండేళ్లు పెంపు

అయితే ఇండియా ఏ, అండర్-19 జట్ల కోచ్‌గా ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించే క్రమంలో ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించలేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌తో కూడిన బీసీసీఐ క్రికెట్‌ సలహా మండలి కూడా ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించేందుకు అంగీకారం తెలిపింది.

10 నెలల కోచ్‌ పదవికి రూ.4 కోట్లు జీతం

10 నెలల కోచ్‌ పదవికి రూ.4 కోట్లు జీతం

అంతకముందు 10 నెలల కోచ్‌ పదవికి గాను బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌కి సుమారు రూ.4 కోట్లను వేతనంగా ఇచ్చింది. తాజా ఒప్పందంతో ద్రవిడ్‌కి ఇంకా పెద్ద మొత్తంలో అందుతుంది. ద్రవిడ్ పదవీ కాలం పొడిగింపు విషయం ఈ నెల మొదట్లో జరిగిన బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్‌లో కూడా చర్చకు వచ్చింది.

టీమిండియా హెడ్ కోచ్‌‌పై ఇలా

టీమిండియా హెడ్ కోచ్‌‌పై ఇలా

మరోవైపు టీమిండియా హెడ్ కోచ్‌ గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ సందర్భంగా బీసీసీఐ నిర్వాహకులు తెలిపారు. బీసీసీఐ కుంబ్లేతో కుదుర్చుకున్న 10 నెలల ఒప్పందం జూన్‌ 20తో ముగుస్తుంది. త్వరలో వెస్టిండిస్ పర్యటనకు వెళ్లే భారత జట్టు ప్రధాన కోచ్‌గా అనిల్‌కుంబ్లేనే వ్యవహరించనున్నారు.

ద్రవిడ్ ఐపీఎల్‌కు దూరమేనా?

ద్రవిడ్ ఐపీఎల్‌కు దూరమేనా?

ఇదిలా ఉంటే లోథా కమిటీ సిఫార్సుల మేరకు రాహుల్ ద్రవిడ్‌ విరుద్ధ ప్రయోజనాలు పొందకూడదు. ఈ నేపథ్యంలో ఇండియా ఏ, అండర్‌-19 క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా కొనసాగితే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)కి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఐపీఎల్‌లో ద్రవిడ్‌ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టుకి మెంటార్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former captain and batting legend Rahul Dravid will continue as India A and Under-19 team coach for another two years.
Please Wait while comments are loading...