క్రికెట్ లెజెండ్ సచిన్‌కు రజనీకాంత్ బెస్ట్ విషెస్: ఎందుకో తెలుసా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా 'సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్' ట్రైలర్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ సచిన్‌ టెండూల్కర్‌కు రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా బెస్ట్ విషెస్ తెలిపారు. అందుకు సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ థ్యాంక్యూ తలైవా అన్నారు. 'ఈ సినిమాని మీరు తమిళంలో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా' అని అన్నారు.

అంతేకాదు సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ సినిమాకు సంబంధించిన తమిళ ట్రైలర్‌ లింక్‌ను సచిన్ జత చేశాడు. ఈ సినిమా ట్రైలర్‌ను ముంబైలోని జుహు ఆడిటోరియంలో సచిన్ ఆవిష్కరించాడు. 'ఈ సినిమా నిర్మాణం ద్వారా నా జీవితంలోని ముఖ్య ఘట్టాల్ని ఆస్వాదించే అవకాశం దక్కింది. నేను సాధారణంగా వ్యక్తిగత విషయాలు ఎవరికీ చెప్పుకోను. అయితే నా జీవితంలోనూ కొన్ని అపురూప ఘట్టాలు ఉన్నాయి. నా అభిమానులకు అవి ఆసక్తికరం. నేను ఇబ్బందిగా భావించని పలు విషయాలను ఇందులో పంచుకున్నాను' అని సచిన్ అన్నాడు.

'నా మీద ఎనలేని ప్రేమ చూపించి, నన్ను ఆశీర్వదించిన అభిమానులు నా ప్రయాణాన్ని 24 ఏళ్ల పాటు నన్ను తమవాడిగా చూసుకున్న భారతీయులందరికీ ఈ చిత్రం మరింత ఆనందం పంచుతుందని ఆశిస్తున్నాను' అని సచిన్‌ ఉద్వేగంగా చెప్పాడు. ఈ సినిమా మే 26న విడుదల కానుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Superstar Rajinikanth has wished Sachin Tendulkar for his upcoming biographical documentary Sachin: A Billion Dreams. The Tamil Superstar took to Twitter to wish the master blaster.
Please Wait while comments are loading...