రాంచీ టెస్టు: ధోని స్టైల్లో బ్రిలియంట్ రనౌట్ చేసిన జడేజా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో మ్యాచ్ చూస్తున్న అభిమానులకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గుర్తుకు వచ్చాడు. అదేంటీ.. ధోని ఎప్పుడో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు కదా.

రాంచీ టెస్టు: ఆసీస్ 451 ఆలౌట్, కేఎల్ రాహుల్ అర్ధసెంచరీ

అలాంటిది ఇప్పుడు ధోని ప్రస్తావన ఎందుకు వచ్చింది అని మీరు అనుకోవచ్చు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్టు జరుగుతున్న రాంచీ స్టేడియం ధోని సొంత మైదానం. అయితే శుక్రవారం నాటి మ్యాచ్‌లో ధోని స్టైల్లో రవీంద్ర జడేజా హేజిల్‌వుడ్‌‌ను రనౌట్ చేశాడు.

Ranchi Test: Ravindra Jadeja does a MS Dhoni as he effects brilliant Run Out

లియాన్ అవుటైన తర్వాత క్రీజులోకి హేజిల్‌వుడ్‌ వచ్చాడు. జడేజా విసిరిన 137.3 బంతిని స్టీవ్ స్మిత్ ఆడాడు. ఈ క్రమంలో రెండో పరుగు కోసం ప్రయత్నించిన హేజిల్‌వుడ్‌ (0)ను రాహుల్ సాయంతో అద్భుతమైన రీతిలో రనౌట్ చేయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది.

రాహుల్ నుంచి బంతిని అందుకున్న జడేజా కళ్లు తిప్పుకోలేని రీతిలో హేజిల్‌వుడ్‌‌ను రనౌట్ చేయడంతో ఆస్ట్రేలియాను 451 పరుగులకే కట్టడి చేశాడు. ఇదిలా ఉంటే ఈ సిరిస్‌లో బెంగుళూరులో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో
ఐదు వికెట్ల తీసుకున్న జడేజా, రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కూడా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.

దీంతో తన కెరీర్‌లో జడేజా ఎనిమిది సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 451 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 178 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 124 పరుగులిచ్చిన జడేజా 5 వికెట్లు తీశాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు తీసుకోగా, ఉమేశ్ యాదవ్ 3, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former India skipper Mahendra Singh Dhoni may not be in Ranchi as India are playing third Test match against Australia here at JSCA International Stadium but Ravindra Jadeja reminded fans of the local lad with a brilliant run out.
Please Wait while comments are loading...