రంజీల్లో ట్రిపుల్ సెంచరీ: ఎవరీ ప్రియాంక్ కీరిత్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రంజీ క్రికెట్ చరిత్రలో గుజరాత్ క్రికెటర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. గ్రూప్-ఏలో భాగంగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్ ప్రియాంక్ కీరిత్ పంచల్ 460 బంతుల్లో 32 ఫోర్లతో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. దీంతో పంచల్ అరుదైన ఘతను సాధించాడు.

రంజీ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు తరుపున తొలి ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా పంచల్ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు అంతక ముందు గుజరాత్ జట్టు తరుపున అత్యధిక పరుగులు సాధించిన ముకుంద్ పర్మర్ (283) స్కోరుని కూడా అధిగమించాడు.

Ranji Trophy 2016: Priyank Kirit Panchal on a roll, hits triple ton

తొలి రోజు ఆటలో భాగంగా మంగళవారం 134 పరుగులతో రాణించిన పంచల్.. రెండో రోజైన బుధవారం ఎక్కువ సేపు క్రీజులో నిలబడి ట్రిపుల్ సాధించి నాటౌట్‌గా నిలిచాడు. పంచల్ ట్రిపుల్ సాధించడంతో గుజరాత్ తన తొలి ఇన్నింగ్స్‌ను ఆరు వికెట్ల నష్టానికి 624 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

గుజరాత్ జట్టులో మెరాయ్ (65), రుజుల్ భట్ (60), కెప్టెన్ అక్షర్ పటేల్(65)లు రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన పంజాబ్ తన తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది.

గుజరాత్ తొలి ఇన్నింగ్స్: 624/6 డిక్లేర్ 156.4 ఓవర్లు (పంచల్ 314 నాటౌట్, సందీప్ శర్మ 3/126. పంజాబ్ 20/1, 6 ఓవర్లు).

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Opener Priyank Kirit Panchal became the first cricketer from Gujarat to score a tripe century at the First Class level as he stayed unbeaten on 314 on day two of the Ranji Trophy Group A match.
Please Wait while comments are loading...