సెహ్వాగ్ గ్రేట్, కోహ్లీ బెస్ట్: క్షమాపణ చెప్పిన పాక్ మాజీ క్రికెటర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గతంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, భారత జట్టుపై తాను చేసిన ట్వీట్లు, కామెంట్లపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ క్షమాపణ చెప్పాడు. ఈ మేరకు ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. గతంలో సెహ్వాగ్‌పై చేసిన వ్యాఖ్యలను సైతం లతీఫ్‌ వెనక్కి తీసుకున్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు  | స్కోరు కార్డు 

ఈ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్‌పై, కెప్టెన్ కోహ్లీపై ప్రశంసల జల్లులు కురిపించాడు. సెహ్వాగ్‌ గ్రేట్‌ ప్లేయర్‌ అని, కోహ్లీ ప్రపంచంలోనే బెస్ట్‌ ప్లేయర్‌ అని కితాబిచ్చాడు. టెస్టు క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన గొప్ప బ్యాట్స్‌మన్ సెహ్వాగ్ అని కొనియాడాడు. అయితే ఇతర దేశాలైనా బంగ్లాదేశ్, పాకిస్తాన్‌, శ్రీలంకలను అగౌరవపరచడం తప్పని పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఉప ఖండానికి చెందిన మూడు దేశాలు సెమీఫైనల్‌‌కు చేరిన సంగతి తెలిసిందే. సెమీపైనల్లో భాగంగా బుధవారం పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్‌తో తలపడుతుండగా, గురువారం బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లపై కూడా రషీద్ లతీఫ్ స్పందించాడు.

టోర్నీ ఫైనల్లో భారత్-పాక్ తలపడాలి

టోర్నీ ఫైనల్లో భారత్-పాక్ తలపడాలి

'ఈ రెండు మ్యాచుల్లో భారత్‌, పాకిస్థాన్‌ విజయం సాధించి ఛాంపియన్స్‌ టోర్నీ ఫైనల్లో తలపడాలని కోరుకుంటున్నా. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కే ఎక్కువ మంది అభిమానులు ఉంటారు' అని లతీఫ్ తెలిపాడు. లీగ్‌లో భారత్‌ చేతిలో ఓడిపోయిన పాక్‌ జట్టుకు అండగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

ఇంగ్లాండ్‌పై పాక్‌ విజయం సాధించాలి

ఇంగ్లాండ్‌పై పాక్‌ విజయం సాధించాలి

'గతంలో చేసిన తప్పుల నుంచి పాఠం నేర్చుకుని సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై పాక్‌ విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఆ తర్వాత ఫైనల్లో పాకిస్థాన్... భారత్‌తో ఆడాలి. అభిమానులకు ఇంతకన్నా ఏం కావాలి. యావత్తు ప్రపంచం మొత్తం ఇదే కోరుకుంటోంది. క్రికెట్‌ అనేది ఒక పవర్‌. దీన్ని చాలా మంది ఆడతారు, చూస్తారు, ఇష్టపడతారు' అని పేర్కొన్నాడు.

భారత జట్టుకు అభినందనలు

భారత జట్టుకు అభినందనలు

'సెమీ ఫైనల్‌కు చేరిన భారత జట్టుకు అభినందనలు. వారికి ఫైనల్ వెళ్లే అవకాశం మెండుగా ఉంది. కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్. కుంబ్లే నిజాయతీ గల వ్యక్తి. నా కెరీర్‌లో కుంబ్లేని ఎదుర్కొన్నాను. కుంబ్లేతోపాటు హర్భజన్‌ సింగ్‌, యువీ, సచిన్‌, గంగూలీ, జడేజా, అజారుద్దీన్‌, శ్రీకాంత్‌, శ్రీనాథ్‌ అందరికీ ఈ సందర్భంగా లతీఫ్‌ శుభాకాంక్షలు తెలిపాడు.

మీడియా వివాదాస్పద వ్యాఖ్యల కోసం ఎదురుచూపు

మీడియా వివాదాస్పద వ్యాఖ్యల కోసం ఎదురుచూపు

‘ఇండియా, పాకిస్థాన్‌ మీడియాలు వివాదాస్పద వ్యాఖ్యల కోసం ఎదురు చూస్తుంటాయి. ఎందుకంటే తమ ఛానళ్లకు హిట్స్‌ పెంచుకునేందుకు. అలాంటి వాటి గురించి పట్టించుకోకండి' అని లతీఫ్ వీడియో ద్వారా తన సందేశాన్ని తెలిపాడు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

అసలు వివాదానికి కారణం

అసలు వివాదానికి కారణం

అసలు వివాదానికి కారణం ఏంటంటే... ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై భారత్‌ 124 పరుగుల తేడాతో నెగ్గిన అనంతరం కంగ్రాట్స్ భారత్.. బాప్ బాప్ హోతా హై అని, బంగ్లాదేశ్‌పై ప్రాక్టీస్ మ్యాచ్‌లో నెగ్గినట్లుగా భారత్ అలవోకగా విజయం సాధించిందని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. దీంతో సెహ్వాగ్ చేసిన ట్వీట్‌పై లతీఫ్ తీవ్ర స్థాయిలో స్పందించాడు. సెహ్వాగ్‌ను కించపరిచేలా ట్వీట్లు చేసిన లతీఫ్ అలాగే ఓ వీడియోను పోస్ట్ చేశాడు. లతీఫ్ కామెంట్లపై స్పందించిన సెహ్వాగ్.. 'చెత్త వాగుడు కంటే.. అర్థానిచ్చే నిశ్శబ్ధం మంచిదేనని' ట్వీట్ చేశాడు. ఆ తర్వాత లతీఫ్ కామెంట్లపై టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. దీంతో లతీఫ్ వెనక్కి తగ్గి వీడియోని పోస్టు చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian cricketer Manoj Tiwary slammed former Pakistan captain and wicketkeeper Rashid Latif for his offensive comments against ex-India opener Virender Sehwag.
Please Wait while comments are loading...