రూ.7 కోట్లు: శాస్త్రి పంట పండింది, కుంబ్లే అడిగిన దానికన్నా తక్కువే!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా కొత్త కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికైన సంగతి తెలిసిందే. గతంలో ఏ కోచ్‌కు దక్కని భారీ వేతన ప్యాకేజీని టీమిండియా రవిశాస్త్రి అందుకోనున్నాడు. రెండేళ్ల ఒప్పందం కింద కోచ్‌గా రవిశాస్త్రికి బీసీసీఐ ఏటా సుమారు ఏడున్నర కోట్లకు పైగా చెల్లించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇటీవలే కోచ్ పదవి నుంచి తప్పుకున్న అనిల్ కుంబ్లే కూడా ఏడాదికి ఏడు కోట్ల వరకు వార్షిక వేతనం అందుకున్నాడు. అయితే ప్రస్తుతం భారత జట్టులో నెలకొన్న పరిస్థితులు రవిశాస్త్రికి అనుకూలంగా మారడంతో శాస్త్రి పెద్ద మొత్తంలో వేతనంగా అదుకనున్నాడు. గతంలో రవిశాస్త్రి టీమ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన 2014-16 సమయంలో రవిశాస్త్రి రూ.7 కోట్ల వార్షిక వేతనం అందుకున్నాడు.

బీసీసీఐ స్థాయికి తగ్గ చెల్లింపులు

బీసీసీఐ స్థాయికి తగ్గ చెల్లింపులు

ప్రపంచంలోనే అత్యంత ధనికమైన క్రికెట్ బోర్డుగా ఉన్న బీసీసీఐ తన ఈ స్థాయికి తగ్గ చెల్లింపులు చెల్లించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సహాయక కోచ్‌లకు కూడా వేతనం భారీగానే ఉందని సమాచారం. ప్రధాన కోచ్‌, సహాయక సిబ్బంది వేతనాలను నిర్ణయించేందుకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, సీఈవో రాహుల్‌ జోహ్రీ, డయానా ఇడుల్జి, బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరితో నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది.

Ravi Shastri and Anil Kumble's Coaching Style Differences | Oneindia Telugu
రవిశాస్త్రితో చర్చించి ఎవరి వేతనం ఎంతో

రవిశాస్త్రితో చర్చించి ఎవరి వేతనం ఎంతో

జులై 19న కమిటీ రవిశాస్త్రితో చర్చించి ఎవరి వేతనం ఎంతో ఈ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. సహాయక కోచ్‌లుగా జట్టు వెంట ఉండే బౌలింగ్, బ్యాటింగ్ కన్సల్టెంట్‌లకు రూ.2 కోట్ల వరకు వేతనం ఉందని సమాచారం. ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్‌కు రూ.2 కోట్ల వేతనమంటే అతడి ప్యాకేజీ కొంతమేరకు పెరిగినట్లే.

సంజయ్ బంగర్ వేతనం ఇలా

సంజయ్ బంగర్ వేతనం ఇలా

అయితే బంగర్‌ను పూర్తి స్థాయి బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తే ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఇక పూర్తిస్థాయి బౌలింగ్ కోచ్‌గా తన స్నేహితుడు భరత్ అరుణ్‌ కావాలని రవిశాస్త్రి పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని తీసుకుంటే ఐపీఎల్ జట్టు బెంగళూరుతో పాటు హైదరాబాద్ రంజీ జట్టు బౌలింగ్ కోచ్ పదవికి స్వస్తి పలకాల్సి ఉంటుంది.

ద్రవిడ్‌కు మరికొంత మొత్తం అదనంగా

ద్రవిడ్‌కు మరికొంత మొత్తం అదనంగా

మరోవైపు ఇండియా ఏ, అండర్ 19 జట్లకు కోచ్‌గా మరో రెండేళ్లపాటు కొనసాగనున్న రాహుల్ ద్రవిడ్‌ తొలి ఏడాదికి రూ.4.5 కోట్లు, రెండో ఏడాదికి రూ.5 కోట్లు వేతనంగా అందుకోనున్నాడు. ఒకవేళ విదేశాల్లో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కొనసాగితే బీసీసీఐ అందుకోసం ద్రవిడ్‌కు మరికొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

100 రోజులకే రూ.4 కోట్లు డిమాండ్ చేసిన జహీర్ ఖాన్

100 రోజులకే రూ.4 కోట్లు డిమాండ్ చేసిన జహీర్ ఖాన్

గతేడాది జహీర్‌ఖాన్‌ను సంప్రదించగా కేవలం 100 రోజులకే రూ.4 కోట్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే బ్యాటింగ్, బౌలింగ్ కన్సల్టెంట్‌లుగా రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్‌లను సీఏసీ ఎంపిక చేసినప్పటికీ వారి నియామకాన్ని నిలిపి ఉంచామని బీసీసీఐ శనివారం పేర్కొన్న సంగతి తెలిసిందే.

కుంబ్లే అడిగిన దాని కన్నా తక్కువే

కుంబ్లే అడిగిన దాని కన్నా తక్కువే

అంతేకాదు కొత్త కోచ్‌ రవిశాస్త్రిని సంప్రదించాకే సహాయక సిబ్బందిని నియమిస్తామని బీసీసీఐ పాలకుల కమిటీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే టీమిండియా కోచ్ వేతనాన్ని తొమ్మిది కోట్లకు పెంచాలని మాజీ కోచ్ అనిల్ కుంబ్లే గతంలో బీసీసీఐ పెద్దలను కోరిన సంగతి తెలిసిందే. కోచ్ హోదాలో ఉండగానే.. తన జీతం పెంచాలని కుంబ్లే కోరడంపై అప్పట్లో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India's newly-appointed head coach Ravi Shastri is likely to be paid between Rs 7 cr to Rs 7.5 cr per year, according to sources.
Please Wait while comments are loading...