న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

6/41: బెంగుళూరు టెస్టులో ప్రపంచ రికార్డు నెలకొల్పిన అశ్విన్

బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించాడు. 

By Nageshwara Rao

హైదరాబాద్: బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించాడు. రెండో టెస్టులో అశ్విన్ 8 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.

<strong>బెంగుళూరు టెస్టు: ప్రతీకారం తీర్చుకున్న కోహ్లీ, ఆసీస్‌పై ఘన విజయం</strong>బెంగుళూరు టెస్టు: ప్రతీకారం తీర్చుకున్న కోహ్లీ, ఆసీస్‌పై ఘన విజయం

మ్యాచ్ ముగిసిన అనంతరం లక్ష రూపాయల నగదుతో పాటు పేటీఎం మెమెంటో అందుకున్నాడు. అయితే ఈ టెస్టులో అశ్విన్ మరో రికార్డుని సొంతం చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 41 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీయడంతో తక్కువ పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసిన ఆటగాళ్ల సరసన చేరాడు.

అంతేకాదు రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీయడంతో అత్యంత వేగంగా ఐదు వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అశ్విన్‌ ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయడం ఇది 25వ సారి. ఈ నేపథ్యంలో అశ్విన్‌ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బౌలర్‌ కూడా అశ్వినే.

Ravichandran Ashwin takes revenge on Mitchell Starc, pockets 6/41

కేవలం 88 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇంతక ముందు ముత్తయ్య మురళీధరన్‌కు 100, ఆర్‌ హెడ్లీకి 111 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించారు. తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 6 వికెట్లు తీయగా అశ్విన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరూ కలిసి మ్యాచ్‌లో మొత్తం 15 వికెట్లు పడగొట్టారు.

కాగా, రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పూణె టెస్టు ఓటమికి కోహ్లీసేన ప్రతీకారం తీర్చుకుంది.

దీంతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ 1-1తో సమమైంది. బెంగుళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా అనూహ్యంగా పుంజుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా ఆరు వికెట్లు తీసుకోగా రెండో ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆరు వికెట్లు తీసుకున్నాడు.

భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లు తీసుకోగా ఉమేశ్ యాదవ్ 2, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక మూడో టెస్టు మార్చి 16వ తేదీన రాంచీలో జరగనుంది.

బెంగుళూరు టెస్టు:
తొలి ఇన్నింగ్స్:
భారత్: 189, ఆస్ట్రేలియా 274
రెండో ఇన్నింగ్స్:
భారత్: 276, ఆస్ట్రేలియా 112 (35.4 ఓవర్లకు)

మ్యాచ్ ఫలితం: 75 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X