మ్యాన్ ఆఫ్ ద సిరిస్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రెండూ జడేజాకే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. అయితే ఈ విజయం వెనుక టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. పుణెలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడినా తిరిగి పుంజుకుని సిరీస్‌ను 2-1తో దక్కించుకోవడంలో జడేజా కీలకపాత్ర పోషించాడు.

ఓడాక కలిసి డిన్నర్ చేద్దాం: వేడ్ కవ్వింపుపై జడేజా (ఫోటోలు)

ఈ సిరిస్‌లో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వికెట్లు తీయడంలో విఫలమైనతే జడేజా మాత్రం ఆసీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. ఈ సిరిస్‌లో మొత్తం 25 వికెట్లు తీసిన జడేజా 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డు అందుకున్నాడు. ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్టులో మొత్తం నాలుగు వికెట్లు తీశాడు.

 Ravindra Jadeja man of the series India win the test series 2-1 vs Australia

ఇక పూణె టెస్టులో ఐదు వికెట్లు, బెంగళూరులో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక డ్రాగా ముగిసిన రాంచీ టెస్టులో జడేజా 9 వికెట్లు తీసి తన విశ్వరూపం ప్రదర్శించాడు.

ధర్మశాల టెస్టులో భారత్ విజయం: 2-1తో టెస్టు సిరిస్ కైవసం

రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక ఈ సిరిస్‌లో ఆల్‌రౌండర్‌ ప్రదర్శన చేసిన జడేజా 25 వికెట్లతో పాటు 127 పరుగులు చేశాడు. ఇక ధర్మశాల టెస్టులో 63 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీసిన జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
All Rounder Ravindra Jadeja man of the series India win the test series 2-1 vs Australia.
Please Wait while comments are loading...