ఆసీస్‌ను వెనక్కి నెట్టిన ఇంగ్లండ్: ర్యాంకింగ్స్‌లో టాప్‌లేపిన జడేజా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టెస్టు ర్యాంకుల్లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన ర్యాంకుని మరింత మెరగుపరచుకున్నాడు. మంగళవారం ఐసీసీ ర్యాంకులను ప్రకటించింది. ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ ఆల్ రౌండర్ల ర్యాంకుల్లో జడేజా అగ్రస్ధానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ ఉల్ హసన్‌ను జడేజా వెనక్కునెట్టాడు.

మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొలంబో వేదికగా జరిగిన రెండ టెస్టులో జడేజా అజేయంగా 70 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు సాధించిన సంగతి తెలిసిందే.

తద్వారా తన రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపరుచుకుని ర్యాంకుల్లో అగ్రస్ధానంలో నిలిచాడు. ప్రస్తుతం 438 రేటింగ్ పాయింట్లతో జడేజా అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. మరొక భారత ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ 418 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

మొయిన్ అలీ(409) నాలుగో స్థానంలో, బెన్ స్టోక్స్(360) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే టెస్టుల్లో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. దక్షిణాఫ్రికాపై నాలుగు టెస్టుల సిరీస్‌ని 3-1తో గెలిచిన ఇంగ్లండ్‌ ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.

ఆసీస్‌ను వెనక్కి నెట్టిన ఇంగ్లండ్

ఆసీస్‌ను వెనక్కి నెట్టిన ఇంగ్లండ్

ఆసీస్‌ను వెనక్కినెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. 1998 తర్వాత దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ సిరీస్‌ నెగ్గడం ఇదే తొలిసారి. అయితే, సిరీస్‌ను కోల్పోయిన దక్షిణాఫ్రికా మాత్రం రెండో స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది. మూడో స్ధానంలో
ఇంగ్లాండ్‌(105), ఆసీస్‌(100), న్యూజిలాండ్‌(97) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు భారత్‌-శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కొనసాగుతుంది. మరో టెస్టు మిగిలి ఉండగానే భారత్‌ 2-0తో సిరీస్‌లో ఆధిక్యం దక్కించుకుంది. చివరి టెస్టులోనూ గెలిస్తే భారత్‌ ఖాతాలో మరికొన్ని పాయింట్లు వచ్చి చేరుతాయి.

Ravindra Jadeja becomes World No. 1 all-rounder
బ్యాట్స్‌మెన్ ర్యాంకులు:

బ్యాట్స్‌మెన్ ర్యాంకులు:

1 Steve Smith (941)
2 Joe Root (891)
3 Cheteshwar Pujara (888)
4 Kane Williamson (880)
5 Virat Kohli (813)
6 Ajinkya Rahane (776)
7 Jonny Bairstow (772)
8 Azhar Ali (769)
9 Hashim Amla (764)
10 David Warner (759)

బౌలర్ ర్యాంకులు:

బౌలర్ ర్యాంకులు:

1 Ravindra Jadeja (893)
2 James Anderson (860)
3 Ravichandran Ashwin (842)
4 Josh Hazlewood (826)
5 Rangana Herath (817)
6 Kagiso Rabada (785)
7 Stuart Broad (775)
8 Dale Steyn (763)
9 Vernon Philander (751)
10 Neil Wagner (745)

ఆల్ రౌండర్ ర్యాంకులు:

ఆల్ రౌండర్ ర్యాంకులు:

1 Ravindra Jadeja (438)
2 Shakib Al Hasan (431)
3 Ravichandran Ashwin (418)
4 Moeen Ali (409)
5 Ben Stokes (362)

కోహ్లీ అభినందన

టెస్టు ర్యాంకింగ్స్‌లో అటు బౌలర్లలో, ఇటు ఆల్ రౌండర్ల జాబితాలో అగ్రస్ధానంలో నిలిచిన టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లకు కెప్టెన్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After clinching the series against Sri Lanka with a massive innings victory at Colombo, Indian team players made giant strides in the latest ICC Test rankings released after the end of the England-South Africa Test at Manchester.
Please Wait while comments are loading...