ఏంటో తెలుసా?: కుమార్తెకు పేరు పెట్టిన రవీంద్ర జడేజా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన కుమార్తెకు నిధ్యాన అని పేరు పెట్టాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ''అంతులేని ఆనందాన్ని నింపిన మా చిన్నారి రాకుమారి పేరు నిధ్యాన'' అని తెలిపాడు.

Ravindra Jadeja, wife give baby daughter Sanskrit inspired name

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు  | స్కోరు కార్డు 

రవీంద్ర జడేజా భార్య రీవా సొలంకీ గత వారం చిన్నారికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. సౌరాష్ట్రకు చెందిన జడేజా ఏప్రిల్ 2016న రాజ్ కోట్‌కు చెందిన రీవా సోలంకీని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రవీంద్ర జడేజా లండన్‌లో ఉన్నాడు.


తనకి కుమార్తె పుట్టినప్పుడు జడేజా లండన్‌లో ఉన్నాడు. దీంతో లండన్‌లో ఉన్న జడేజా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆ శుభవార్తను జట్టులోని సహచర ఆటగాళ్లతో పంచుకున్నాడు. దీంతో వాళ్లు జడేజాకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, జడేజా భార్య రీవా సోలంకీ మెకానికల్ ఇంజనీర్.

అభిమానులకు శుభవార్త: జడేజాకు తండ్రిగా ప్రమోషన్

రాజ్ కోట్‌కు చెందిన కాంట్రాక్టర్, వ్యాపారవేత్త ఏకైక కుమార్తె రివా సోలంకీతో జడేజా వివాహం గతేడాది అత్తవారి స్టార్ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సెమీఫైనల్ 2లో టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్స్‌కు చేరుతుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India all-rounder Ravindra Jadeja, who recently became father of a baby girl has named his “bundle of joy and little princess” ‘Nidhyana’. Jadeja is right now on national duty and will be representing India in the ICC Champions Trophy 2017 semi-final against Bangladesh on June 15, 2017.
Please Wait while comments are loading...