భువీతో మిస్టరీ డేట్: ఆ లక్కీ గర్ల్ ఎవరో తెలిసింది?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌ జరుగుతున్న సమయంలో ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ బాలీవుడ్ నటి సాగరిక ఘోష్‌తో నిశ్చితార్థం చేసుకుని అందరినీ ఆశ్చరపరిచాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భువనేశ్వర్ కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్టు చేసి 'రెస్టారెంట్‌లో డిన్నర్‌ చేస్తున్న ఫొటో ఇది. డిన్నర్‌ డేట్‌.. పూర్తి చిత్రం త్వరలో' అని పేర్కొన్నాడు.

త్వరలోనే పుల్ పిక్చర్‌

త్వరలోనే పుల్ పిక్చర్‌

నగరంలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన సందర్భంలో భువనేశ్వర్ చేతిలో గ్లాస్, అందులో రెండు స్ట్రాలు ఉన్న ఫొటోను అప్ లోడ్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే పుల్ పిక్చర్‌ను చూస్తారంటూ మరింత ఆసక్తిని రేకెత్తించాడు. దీంతో వెంటనే అభిమానులు ఎవరా లక్కీగర్ల్‌ అంటూ కామెంట్లు పెట్టారు.

భువనేశ్వర్‌తో కలిసి డిన్నర్‌ చేసింది ఎవరంటే

భువనేశ్వర్‌తో కలిసి డిన్నర్‌ చేసింది ఎవరంటే

ఇప్పుడు భువనేశ్వర్‌తో కలిసి డిన్నర్‌ చేసింది ఎవరో తెలిసిపోయింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ మోడల్‌, టాలీవుడ్‌ నటి అనుస్మృతి సర్కార్‌. వీరిద్దరూ కలిసి కారులో వెళ్తూ అభిమానుల కంటపడ్డారు. ఇంకేముంది వారు వెంటనే తమ ఫోన్లకు పని చెప్పి ఫొటోలు తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.

బెంగాలీ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లో కూడా

బెంగాలీ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లో కూడా

అనుస్మృతి సర్కార్‌ ఇప్పటికే పలు బెంగాలీ సినిమాల్లో నటించి బాలీవుడ్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తోందని సమాచారం. తెలుగులో కూడా రెండు మూడు చిత్రాల్లో నటించిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2011లో వచ్చిన వంకాయ్‌ ఫ్రై చిత్రంలో పూజ క్యారెక్టర్‌లో కనిపించింది. 2014లో ఇష్టసఖి, 2015లో హీరోయిన్‌ అనే సినిమాల్లో నటించింది.

బాలీవుడ్ అవకాశాల కోసం ముంబైలో

బాలీవుడ్ అవకాశాల కోసం ముంబైలో

ప్రస్తుతం ముంబైలో ఉంటూ బాలీవుడ్ అవకాశాల కోసం ఎదురుచూస్తోందని సమాచారం. ఇదిలా ఉంటే ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమిపాలై టోర్నీ నుంచి తప్పుకుంది. కాగా ఈ సీజన్‌లో 26 వికెట్లు తీసిన భువనేశ్వర్ అత్యధిక వికెట్లు తీసి పర్పెల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It’s not just on the pitch that cricketer Bhuvaneshwar Kumar is giving reasons to his fans to talk about him. Recently, the popular cricketer uploaded a picture on Instagram, which shows him having a drink at a restaurant. He captioned it: “Dinner date, full pic soon”.
Please Wait while comments are loading...