ఆ బెల్టు నా దగ్గరే ఉంది: కోహ్లీ, పాండ్యాలకు రోహిత్ శర్మ పంచ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆదివారం భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్టు ముగిసిన సంగతి తెలిసిందే. ఒక రోజు ముందుగానే రెండో టెస్టు ముగియడంతో భారత ఆటగాళ్లు సంతోషంలో మునిగితేలారు. అదే రోజు ప్రెండ్ షిప్ డే కావడంతో భారత ఆటగాళ్లు బ్ల్యూడబ్ల్యూ రెజ్లర్‌ ది గ్రేట్‌ ఖలీని కలిశారు.

అనంతరం భారత ఆటగాళ్లు హర్ధిక్‌ పాండ్యా, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌ ఫోటోలు దిగి అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలను తాజాగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

Rohit Shows Who's Boss after Kohli & Boys Meet The Great Khali

'ఖలీ రెజ్లింగ్‌ బెల్ట్‌ కోసం గొప్ప ప్రయత్నం చేశారు మిత్రులారా.. కానీ, బెల్టు నా దగ్గర ఉంది' అని డబ్ల్యూడబ్ల్యూఈ బెల్ట్‌తో ఉన్న ఫోటోని ట్వీట్‌ చేశాడు. అయితే ఈ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుంది. ఐపీఎల్‌ 10వ సీజన్‌ ట్రోఫీని ముంబై ఇండియన్స్‌ జట్టు గెలుచుకుంది.

ఈ సందర్భంగా 14 సార్లు ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌గా నిలిచిన ట్రిపుల్‌ హెచ్‌ తన టైటిల్‌(బెల్టు)ని రోహిత్‌ శర్మకి కానుకగా అందించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే శ్రీలంకతో చివరిదైన మూడో టెస్టు ఆగస్టు 12న ప్రారంభం కానుంది. రెండు రోజుల విశ్రాంతి అనంతరం ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని కోహ్లీసేన భావిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian cricketer Rohit Sharma on Wednesday trolled his teammates after they met former World Wrestling Entertainment (WWE) wrestler The Great Khali on August 7. The batsman uploaded a split picture of him holding the WWE Championship belt and his teammates meeting Khali and captioned it as, "Well tried fellas, but the belt is here," followed by a string of emojis.
Please Wait while comments are loading...