ఆశీర్వాదం తీసుకున్నా: ప్రధానితో సచిన్, వెంట భార్య అంజలి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్, రాజ్యసభ సభ్యుడు సచిన్‌ టెండూల్కర్‌ తన భార్య అంజలితో కలిసి శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీని తన కార్యాలయంలో కలిశారు. సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన 'సచిన్‌ ఏ బిలియన్‌ డ్రీమ్స్‌' చిత్రం వచ్చే శుక్రవారం (మే 26) విడుదల కానున్న నేపథ్యంలో ప్రధానిని కలిశారు.

ప్రధాని మోడీకి క్లుప్తంగా వివరించా

ఈ సందర్భంగా తన చిత్రం విశేషాలకు సంబంధించిన వివరాలను ప్రధాని మోడీకి క్లుప్తంగా వివరించినట్లు పేర్కొంటూ మోడీతో కరాచలనం చేస్తున్న ఫొటోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆశీర్వాదం కూడా తీసుకున్నట్లు సచిన్ అందులో పేర్కొన్నాడు.

సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

ఈ సందర్భంగా ప్రధాని మోడీ సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. హాలివుడ్‌ దర్శకుడు జెమ్స్‌ ఎర్సకైన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సచిన్‌ టెండూల్కర్ జీవితంలో ఎవరికీ తెలియని విషయాలను చూపించారు. ఈ సినిమాకి సంగీతం ఏఆర్‌ రెహమాన్‌ అందించాడు. ఇప్పటికే ఈ సినిమాకి ఛత్తీస్‌గఢ్‌, కేరళ రాష్ట్రాలు పన్ను మినహయింపునిచ్చాయి.

సచిన్ ప్రేమ కథ గురించి ఈ సినిమాలో

ఈ సినిమాతో కెరీర్‌ గురించే కాకుండా తన ప్రేమ కథ గురించి కూడా తెలుసుకుంటారని ఇటీవలే సచిన్ మీడియాతో చెప్పాడు. ‘ఈ చిత్రంలో నా జీవితంలోని ప్రణయ గాథనూ మీరు చూస్తారు. నా క్రీడా ప్రస్థానాన్ని మలచడంలో నా సతీమణి (అంజలి) పాత్ర ఎంతో కీలకం' అని సచిన్‌ ఓ టీవీ ఛానల్‌తో అన్నాడు.

ఇప్పటికే విడుదలైన సచిన్‌ ట్రైలర్‌, పాటలు

ఇప్పటికే విడుదలైన సచిన్‌ ట్రైలర్‌, పాటలు

‘అంజలి నా కెరీర్‌లో ఓ భాగం. నా జీవితంలోని అత్యుత్తమ భాగం అంజలి. ఐతే ఆమె ఎప్పుడూ నా కెరీర్‌లో జోక్యం చేసుకోలేదు. ఈ బయోపిక్‌ ద్వారా నా వ్యక్తిగత ఆలోచనలు, సంఘటనలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నా' అని అన్నాడు. తానెప్పుడూ ఎడమ కాలికే ముందు ప్యాడ్‌ వేసుకొంటానని, అది తనకు సెంటిమెంట్‌ అన్నాడు. ఇప్పటికే విడుదలైన సచిన్‌ ట్రైలర్‌, పాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Legendary Indian cricketer Sachin Tendulkar along with wife Anjali met the Prime Minister of India Narendra Modi a week a before the release of his movie 'Sachin: A Billion Dreams'.
Please Wait while comments are loading...