చేయి పట్టుకుని ప్రపంచాన్ని చూపించావు: ఫాదర్స్ డే రోజున సచిన్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జూన్ 18(ఆదివారం) ఫాదర్స్ డే. ఈ సందర్భంగా తన తండ్రి ర‌మేశ్ టెండూల్కర్‌ను క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గుర్తు చేసుకున్నారు. హ్యాపీ ఫాద‌ర్స్ డే అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి త‌న తండ్రితో క‌లిసి దిగిన ఫోటోను సచిన్ అభిమానులతో పంచుకున్నాడు.

'నా చేయి ప‌ట్టుకొని ఈ ప్ర‌పంచాన్ని నాకు చూపించావు. అంతేకాదు.. మంచి స‌ల‌హా ఇచ్చావు.. హ్యాపీ ఫాద‌ర్స్ డే' అంటూ సచిన్ టెండూల్కర్ పోస్టు చేశాడు. సచిన్ పోస్టు చేసిన 10 నిమిషాల్లోనే ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. సచిన్‌ తండ్రి, ప్రొఫెసర్‌ రమేష్‌ టెండూల్కర్‌ గుండెపోటుతో 1999లో ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
On the occasion of Father’s Day, former Indian batsman Sachin Tendulkar remembered his dad and shared a nostalgic moment on social media. The former legendary batsman posted a photo from his younger days wherein his father (Ramesh Tendulkar) is seen handing him a bat. In a message, he wrote, “You held my hand, showed me the world and gave me the best advice. Happy father’s day!”.
Please Wait while comments are loading...