సచిన్ అయితే మాకేంటి?, మాకు ఓ రేటుంది: తేల్చేసిన బీసీసీఐ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌'. 200 నాటౌట్‌ సంస్థ ఈ సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం సచిన్ ఆడిన విజువ‌ల్స్‌ను చిత్ర నిర్మాణ సంస్థ త‌మ ద‌గ్గ‌ర కొనుక్కోవాల్సిందేన‌ని బోర్డు స్ప‌ష్టంచేసింది.

నిర్మొహమాటంగా తిరస్కరించిన బీసీసీఐ

నిర్మొహమాటంగా తిరస్కరించిన బీసీసీఐ

ఈ సినిమా కోసం అవరసమైన పుటేజీని రాయితీతో అందించాలని నిర్మాణ సంస్థ కోరగా బీసీసీఐ నిర్మొహమాటంగా తిరస్కరించింది. ఎవ‌రైనా ఏ ప్లేయ‌ర్ ఆడిన విజువ‌ల్స్ అయినా వాణిజ్య అవ‌స‌రాల కోసం వాడుకోవాలంటే త‌మ‌కు డ‌బ్బు చెల్లించాల్సిందేన‌ని గ‌తంలోనే బీసీసీఐ చెప్పింది. ప్ర‌తి దానికీ ఓ రేటు కార్డును కూడా బోర్డు నిర్ణ‌యించింది.

సచిన్ రిటైర్మెంట్‌ ప్రసంగం మాత్రం ఉచితంగా

సచిన్ రిటైర్మెంట్‌ ప్రసంగం మాత్రం ఉచితంగా

అయితే 3 నిమిషాల 50 సెకండ్ల నిడివి గల సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్‌ ప్రసంగం మాత్రం ఉచితంగా అందిస్తామని బీసీసీఐ తెలిపింది. బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించే మ్యాచ్‌ల వీడియో కాపీరైట్స్‌ బోర్డు వద్దే ఉంటాయి. ఎవరైనా వాటిని వాణిజ్య పరంగా వినియోగించాలంటే బీసీసీఐ నుంచి కొనుగోలు చేయాల్సిందే.

మ్యాచ్ ప్రాముఖ్యతను బట్టి ధరల్లో తేడా

మ్యాచ్ ప్రాముఖ్యతను బట్టి ధరల్లో తేడా

అయితే మ్యాచ్ ప్రాముఖ్యతను బట్టి వాటి ధరల్లో తేడా ఉంటుంది. గ‌తంలో ధోనీ సినిమా కోసం అరున్ పాండే ఇలాగే అత‌ని ఫుటేజీని బోర్డుకు డ‌బ్బిచ్చి కొనుగోలు చేశాడు. బీసీసీఐకి ఒక విధానం ఉంది. ధోనీ సినిమాకు రాయితీ ఇవ్వ‌లేదు. మ‌రి స‌చిన్‌కు ఎలా ఇస్తాం. ఇది ఓ వాణిజ్య చిత్రం. థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శిస్తారు. దీనివ‌ల్ల నిర్మాత‌ల‌కు లాభ‌మే క‌దా అని బోర్డులోని ఓ సీనియ‌ర్ అధికారి అన్నారు.

ఇంకా చర్చలు జరుగుతూనే

ఇంకా చర్చలు జరుగుతూనే

అయితే బోర్డుతో ఇంకా చ‌ర్చ‌లు జరుగుతూనే ఉన్నాయ‌ని సినిమా నిర్మాత‌, 200 నాటౌట్ వ్య‌వ‌స్థాప‌కుడు ర‌వి భాగ్‌చంద్కా వెల్ల‌డించారు. దేశవ్యాప్తంగా వందల థియేటర్లలో ఈ సినిమా మే 26న విడుద‌ల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Board of Control for Cricket in India (BCCI) has refused to give a concession to 200 Not Out, the production company behind the film “Sachin: A Billion Dreams”, to use footage related to Master Blaster for his upcoming biopic.
Please Wait while comments are loading...