మరో ఘనత సాధించిన సచిన్ బుక్ 'ప్లేయింగ్ ఇట్ మై వే'

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిమానులకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. సచిన్ జీవిత చరిత్ర ఆధారంగా రచించిన 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకానికి అవార్డు లభించడమే ఇందుకు కారణం. బయోగ్రఫీ కేటగిరిలో ప్రతిఏటా ఇచ్చే రేమండ్ క్రాస్‌వర్డ్ పాపులర్ అవార్డు ఈ ఏడాది సచిన్ పుస్తకానికి దక్కింది.

 Sachin Tendulkar thanks fans for 'invaluable support'

ఈ అవార్డు దక్కిన ఆనందాన్ని సచిన్ ట్విట్టర్ వేదిగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ మేరకు అభిమానులు తన పట్ల చూపించిన మద్దతుకు ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపాడు. అవార్డుతో ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

ఈ సందర్భంగా సచిన్ గురువారం మీడియాతో మాట్లాడాడు. తన జీవితంలో తనవెంటే ఉండి తన ఎదుగుదలకు ఎంతగానో సాయపడిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పడం సరిపోదని, వీడ్కోలు తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తనకు ఎంతోగానో మద్దతుగా నిలిచారని తెలిపాడు.

లిమ్కా బుక్‌ రికార్డుకెక్కిన సచిన్‌ ఆటోబయోగ్రఫీ

'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకంలో తన క్రికెట్ జీవితంలోని విశేషాలతో పాటు మిగతా వాటిని కూడా పొందుపరిచామని అన్నాడు. కాగా, సచిన్ జీవితం ఆధారంగా రచించిన ఈ పుస్తకం విడుదలైన మొదటిరోజే అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకంగా నిలిచింది.

ఫ్యాబ్ ఫోర్: సచిన్ ఆత్మకథ విడుదల ఇలా (పిక్చర్స్ )

అంతేకాదు లిమ్కా బుక్స్ ఆఫ్ రికార్డులో కూడా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను తన పేరును లిఖించుకున్న సచిన్ .. క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత ఈ పుస్తక విడుదల సమయంలో పలు రికార్డులను సృష్టించాడు. ఈ పుస్తకం తెలుగుతో పాటు మరాఠీ, హిందీ, గుజరాతీ, మలయాళం, అస్సామీ, బెంగాలీ బాషల్లో కూడా ప్రచురించారు.

తెలుగు భాషలో కూడా సచిన్ పుస్తకం, దేవుడ్ని కాదని..

ఆపిల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీ రికార్డు స్థాయిలో 1,30,000 కాపీల అమ్మకాలను సాధించింది. సచిన్ పుస్తకం(కాల్పనికేతర హార్డ్‌బాక్) 1,50,000 కాపీల అమ్మకాలతో ఆ రికార్డును బద్దలు కొట్టింది. సచిన్ జీవిత చరిత్ర ఆధారంగా రచించిన ఈ పుస్తకాన్ని 'హెచ్చీట్ ఇండియా' సంస్ధ మార్కెట్లోకి తీసుకొచ్చింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Iconic cricketer Sachin Tendulkar reached out to his fans after his autobiography 'Playing It My Way' won the Raymond Crossword Popular Award in the biography category.
Please Wait while comments are loading...