ఆరంభం అదుర్స్: ఆసీస్ నడ్డివిరిచిన కుల్దీప్‌పై సచిన్ ప్రశంసలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అరంగేట్రం టెస్టులోనే అదరగొడుతున్న కుల్దీప్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న కుల్దీప్ యాదవ్‌ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్‌ బౌలింగ్‌పై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ట్విటర్లో ప్రశంసల వర్షం కురిపించాడు.

'కుల్దీప్‌ నీ ఆరంభం అదిరిపోయింది. బౌలింగ్‌లో నువ్వు చూపిస్తున్న వైవిధ్యం నన్ను ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌ నీ కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది' అని కుల్దీప్ బౌలింగ్‌పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ, వెటరన్ ఆటగాడు హర్భజన్ సింగ్ కూడా కుల్దీప్‌పై ప్రశంసలు కురిపించారు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్‌ మూడు వికెట్లు తీసి ఆస్ట్రేలియాను కష్టాల్లోకి నెట్టాడు. తన టెస్టు కెరీర్ తొలి వికెట్‌గా డేవిడ్ వార్నర్(56)ను అవుట్ చేసిన కుల్దీప్ ఆ తరువాత కాసేపటికి మరో ఆటగాడు హ్యాండ్స్ కోంబ్‌ని 8 పరుగుల వద్ద అవుట్ చేశాడు.

ఆ తర్వాత 48వ ఓవర్‌ నాలుగో బంతికి మాక్స్‌వెల్‌(8)కు నాలుగు పరుగులు ఇచ్చిన కుల్‌దీప్‌.. అదే ఓవర్‌ చివరి బంతికి క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా లంచ్‌ తర్వాత నాలుగు వికెట్లు కోల్పోయింది. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న కుల్దీప్ యాదవ్‌ ఓ అద్భుత బంతికి ఆసీస్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌‌ను అవుట్ చేశాడు.

దీంతో 87 బంతులను ఎదుర్కొన్న వార్నర్ 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌‌కు చేరాడు. దీంతో వార్నర్ పెవిలియన్‌కు చేరాడు. అరంగేట్రం చేసిన టెస్టులోనే వార్నర్ లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ని అవుట్ కుల్దీప్ అవుట్ చేయడంతో జట్టు సభ్యులందరూ అతడిని అభినందించారు. మరోవైపు టెస్టుల్లో తొలి వికెట్ తీసిన ఆనందంలో భావోద్వేగానికి గురైన కుల్దీప్... కెప్టెన్ రహానేను హత్తుకున్నాడు.

కుల్దీప్ వ‌య‌సు 22 ఏళ్లు. ఎడ‌మ చేతి స్పిన్న‌ర్‌. వాస్త‌వానికి గాయ‌ప‌డ్డ కోహ్లీ స్థానంలో తుది జ‌ట్టులో శ్రేయాస్ అయ్య‌ర్‌ను తీసుకుంటార‌ని అందరూ భావించారు. ఈ మేరకు అతడిని ధర్మశాలకు కూడా బీసీసీఐ పిలిపించింది. అయితే చివరి నిమిషంలో కోహ్లీ స్థానంలో కుల్‌దీప్‌కు టీమ్‌ మేనేజ్‌మెంట్ చోటు కల్పించి ఆశ్చర్య పరిచింది.

Sachin Tendulkar, Twitterati impressed with India debutant Kuldeep Yadav

2014లో జ‌రిగిన అండ‌ర్‌-19 వ‌రల్డ్‌క‌ప్‌లో కుల్దీప్ ఆడాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్‌, కోల్‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించాడు. మొత్తం 22 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ వాటిల్లో 723 పరుగులు స్కోర్ చేశాడు.
అత్యధిక స్కోరు 117 పరుగులు. ఇక బౌలర్‌గా 81 వికెట్లు తీశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It wasn’t an ideal start to the fourth and final Test for the Indian cricket team as Virat Kohli was ruled out of the decider due to his injured shoulder. Ajinkya Rahane was in charge, and there were couple of changes in the XI. Ishant Sharma made way for Bhuvneshwar Kumar and in came Kuldeep Yadav for Karun Nair.
Please Wait while comments are loading...