యువీ రికార్డు సమం: 3వ ఇండియన్, ఒకే ఓవర్‌లో 6 సిక్సులు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్, బాలీవుడ్ నటి, మోడల్ హాజెల్ కీచ్‌ మూడు ముళ్ల బంధంతో బుధవారం ఒక్కటైన సందర్భంగా యావత్ దేశమొత్తం ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే క్రమంలో సాగర్ మిశ్రా అనే ఓ యువ క్రికెట్ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ల ఎలైట్ గ్రూప్‌లో చేరాడు.

సాయం చేయడానికి సిద్ధం: యువీకి గంభీర్ పెళ్లి వార్నింగ్

వివరాల్లోకి వెళితే టైమ్స్ షీల్డ్ 'బి' డివిజన్ మ్యాచ్‌లో భాగంగా వెస్ట్రన్ రైల్వేస్‌ జట్టుకు చెందిన 23 ఏళ్ల సాగర్ మిశ్రా ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు బాదాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన మూడో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. అంతక ముందు రవిశాస్త్రి, యువరాజ్ సింగ్ మాత్రమే ఈ ఘనతను సాధించిన వారిలో ఉన్నారు.

ఇక్కడ విశేషం ఏమిటంటే సాగర్ మిశ్రా కూడా కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం 46 బంతుల్లో మొత్తం 91 పరుగులు సాధించాడు. తొలుత 35 బంతులను ఎదుర్కొని 51 పరుగులు సాధించిన మిశ్రా ఆర్‌సీఎఫ్ బౌలర్ తుషార్ కుమారే బౌలింగ్‌లో తన బ్యాట్‌ను ఝళిపించాడు.

Sagar Mishra of Western Railways does a Yuvraj Singh, hits six 6s inan over

ఫోటోలు: మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన యువీ, కీచ్

చివరి 11 బంతుల్లో మిశ్రా 9 సిక్సులు బాదడం విశేషం. ప్రత్యర్ధి జట్టు లెప్ట్ ఆర్మ్ స్ఫిన్నర్ చక్కగా బౌలింగ్ వేస్తున్నాడనే కారణంతో తనను నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు దించారని మ్యాచ్ అనంతరం సాగర్ మిశ్రా మీడియాతో తెలిపాడు. 'నా కల నెరవేరింది. 9 ఏళ్ల క్రితం యువరాజ్ ఆరు సిక్సులు కొట్టిన మ్యాచ్‌ని టీవిలో చూశా.

సరిగ్గా అలానే తాను ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొడతానని ఊహించలేదు' అని మిశ్రా చెప్పాడు. అయితే తన ఇన్నింగ్స్‌ను సెంచరీగా మలచడంలో విఫలమైనందుకు నిరాశ చెందుతున్నానని తెలిపాడు. 2007లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నమెంట్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టిన సంగతి తెలిసిందే.

ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఓవర్‌లో యువరాజ్ సింగ్ ఆరు సిక్సులు సాధించి వరల్డ్ రికార్డుని నెలకొల్పాడు. అదే మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ అత్యంత వేగంగా అర్ధ సెంచరీని నమోదు చేయడం విశేషం. ఇది ఇప్పటికీ వరల్డ్ రికార్డుగానే ఉంది. 1985లో జరిగిన ఓ రంజీ ట్రోఫీలో రవిశాస్త్రి కూడా ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At a time when people are congratulating veteran India cricketer Yuvraj Singh for getting married to actress Hazel Keech, a young cricketer named Sagar Mishra has joined the stylish left-handed batsman's elite club.
Please Wait while comments are loading...