తేదీపై అస్పష్టత: ఈ ఏడాది చివర్లో జహీర్‌, సాగరికల పెళ్లి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ నటి సాగరిక ఘట్గేలు ఈ వింటర్ సీజన్‌లో ఓ ఇంటివారు కానున్నారు. అయితే వీరి వివాహా తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఈ సంవత్సరాంతంలో తామిద్దరం పెళ్లి చేసుకోనున్నట్టు సాగరిక ముంబై మిర్రర్‌కి ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించింది.

'ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కొన్ని తేదీలను పరిశీలించాం. మరికొన్నింటిని షార్ట్ లిస్ట్ చేశాం. పెళ్లి తేదీలపై జహీర్‌తో కలిసి తుది నిర్ణయం తీసుకోవాలి' అని సాగరిక వివరించింది.

 Sagarika Ghatge and Zaheer Khan's wedding: You might want to save this date

జహీర్‌, సాగరికల ఎంగేజ్‌మెంట్‌ గత ఏప్రిల్‌లో జరిగిన సంగతి తెలిసిందే. కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్న వీరిద్దరూ ఒకరినొకరిని ప్రేమించుకోవడం ప్రారంభించారు. చివరకి వీరి ప్రేమాయణానికి ఏప్రిల్‌లో ఎంగేజ్‌మెంట్‌తో పుల్ స్టాప్ పెట్టారు. ఎంగేజ్‌మెంట్ అనంతరం ప్రస్తుతం ఇద్దరూ ప్రపంచాన్ని చుట్టి వస్తున్నారు.

వెస్టిండిస్ పర్యటనలో ప్రేయసితో మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్

Zaheer Khan 'Consultant' Not Bowling Coach : BCCI New twist | Oneindia Telugu

ఇటీవలే టీమిండియా వెస్టిండిస్‌లో పర్యటించిన సమయంలో జహీర్ ఖాన్, సాగరికలు కూడా వెస్టిండిస్‌లో పర్యటించి సరదాగా గడిపారు. టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు జహీర్ ఖాన్ కామెంటేటర్‌గా వ్యవహరించాడు. వెస్టిండిస్ పర్యటన అనంతరం ఈ ప్రేమపక్షలు న్యూయార్క్, దుబాయ్ సందర్శనకు వెళ్లారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Indian cricketer Zaheer Khan and Bollywood actress Sagarika Ghatge, who announced their engagement in April earlier this year, might be tying wedding knot by the end of this year.
Please Wait while comments are loading...