ఐపీఎల్‌లో ఏడో 'హిట్' వికెట్: మొత్తం బ్యాట్స్‌మెన్ల జాబితా ఇదే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది.

పరుగుల ఖాతా తెరవకముందే తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ నరైన్‌ వికెట్‌ కోల్పోయింది. తొలి ఓవర్‌ను మేడిన్ చేసి వికెట్ తీసిన ఉనాద్కత్ ఐపీఎల్ పదో సీజన్‌లో తొలి ఓవర్‌ను మేడిన్ చేసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. దీంతో కోల్‌కతా పరుగులేమీ చేయకుండా తొలి వికెట్‌ను కోల్పోయింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ షెల్డన్‌ జాక్సన్‌ 10 పరుగుల వద్ద వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఐపీఎల్‌‌ చరిత్రలో జాక్సన్‌ది ఏడో హిట్‌వికెట్‌ వెనుదిరగడం విశేషం. ఒక వైపు వికెట్లుపడుతున్న కెప్టెన్ గంభీర్ దాటిగా ఆడాడు. సుందర్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ కోట్టిన గంభీర్ క్యాచ్ అవుటయ్యాడు.

దీంతో పవర్ ప్లేలో కోల్‌కతా మూడు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో పవర్ ప్లేలో కోల్‌కతా నమోదు చేసిన రెండో అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం. ఆదివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగులు చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన యూసఫ్ పఠాన్ కూడా పెవిలియన్‌కు చేరాడు.

ఆ తర్వాత 4 ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో 37 పరుగులు చేసిన మనీష్ పాండే క్రిస్టియన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ వద్ద రహానేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

చివర్లో ఉనాద్కత్ వేసిన 19 ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ వరుస బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాదగా... కౌల్టర్ నైల్ మరో సిక్స్ బాదడంతో 21 పరుగులు వచ్చాయి. ఇక ఆఖరి ఓవర్లో బెన్ స్టోక్స్ ఒక వికెట్ తీసి నాలుగు పరుగులు ఇవ్వడంతో కోల్‌కతా ఎనిమిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు హిట్ వికెట్‌గా వెనుదిరిగిన బ్యాట్స్‌మెన్లు వీరే:

షెల్డన్‌ జాక్సన్‌ - ఐపీఎల్ 2017

షెల్డన్‌ జాక్సన్‌ - ఐపీఎల్ 2017

జట్టు: కోల్ కతా నైట్ రైడర్స్
సంవత్సరం: 2017
ప్రత్యర్ధి: రైజింగ్ పూణె సూపర్ జెయింట్
బౌలర్: వాషింగ్టన్ సుందర్

యువరాజ్ సింగ్ - ఐపీఎల్ 2016

యువరాజ్ సింగ్ - ఐపీఎల్ 2016

జట్టు: సన్ రైజర్స్ హైదరాబాద్
సంవత్సరం: 2016
ప్రత్యర్ధి: ముంబై ఇండియన్స్
బౌలర్: మిచెల్ మెకన్‌గ్లన్

సౌరభ్ తివారీ - ఐపీఎల్ 2012

సౌరభ్ తివారీ - ఐపీఎల్ 2012

జట్టు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
సంవత్సరం: 2012
ప్రత్యర్ధి: ముంబై ఇండియన్స్
బౌలర్: హర్భజన్ సింగ్

రవీంద్ర జడేజా - ఐపీఎల్ 2102

రవీంద్ర జడేజా - ఐపీఎల్ 2102

జట్టు: చెన్నై సూపర్ కింగ్స్
సంవత్సరం: 2012
ప్రత్యర్ధి: డెక్కన్ ఛార్జర్స్
బౌలర్: డేల్ స్టెయిన్

స్వప్నిల్ అశ్నోద్కర్ - ఐపీఎల్ 2009

స్వప్నిల్ అశ్నోద్కర్ - ఐపీఎల్ 2009

జట్టు: రాజస్థాన్ రాయల్స్
సంవత్సరం: 2009
ప్రత్యర్ధి: చెన్నై సూపర్ కింగ్స్
బౌలర్: మోర్నీ మోర్కెల్

మిస్బా ఉల్ హక్ - ఐపీఎల్ 2008

మిస్బా ఉల్ హక్ - ఐపీఎల్ 2008

జట్టు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
సంవత్సరం: 2008
ప్రత్యర్ధి: కింగ్స్ ఎలెవన్ పంజాబ్
బౌలర్: శ్రీశాంత్

ముసవీర్ కోటే - ఐపీఎల్ 2008

ముసవీర్ కోటే - ఐపీఎల్ 2008

జట్టు: ముంబై ఇండియన్స్
సంవత్సరం: 2008
ప్రత్యర్ధి: కింగ్స్ ఎలెవన్ పంజాబ్
బౌలర్: శ్రీశాంత్

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kolkata Knight Riders' (KKR) batsman Sheldon Jackson became the first batsman in Indian Premier League (IPL) 2017 to be dismissed hit-wicket.
Please Wait while comments are loading...