అది గబ్బర్‌కే సాధ్యమైంది: బంగ్లాతో మ్యాచ్ తర్వాత బద్దలైన రికార్డులివి!..

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్ గబ్బర్ మరోసారి అదరగొట్టాడు. గత ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రదర్శించిన ఆటను మరోసారి రిపీట్ చేశాడు. అయితే మునుపటి కన్నా ఈసారి మరిన్ని ఎక్కువ పరుగులు తన ఖాతాలో వేసుకున్న ధావన్.. పలు రికార్డుల్ని సైతం సొంతం చేసుకోవడం విశేషం.

గతంలో జరిగిన 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో 363 పరుగులతో 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'గా నిలిచిన శిఖర్ ధావన్.. ఈ దఫా 317పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న 665పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే వరుసగా రెండు ఛాంపియన్ ట్రోఫీ ఎడిషన్స్ లో 300 పైచిలుకు స్కోర్ సాధించిన తొలి టీమిండియా బ్యాట్స్ మెన్ గాను ధావన్ రికార్డు సొంతం చేసుకున్నాడు.

నిన్నటి మ్యాచ్ తో ప్రపంచ క్రికెట్ లో ఇంగ్లాండ్ గడ్డ పలు రికార్డులకు వేదికగా మారగా.. ట్రోఫీ మొత్తంలో పలువురు క్రికెటర్లు పలు రికార్డులను సొంతం చేసుకున్నారు.

ఇంగ్లాండ్ గడ్డపై1000సెంచరీలు:

ఇంగ్లాండ్ గడ్డపై1000సెంచరీలు:

భారత్ వర్సెస్ బంగ్లా మ్యాచ్ లో రోహిత్ శర్మ నమోదు చేసిన సెంచరీ ద్వారా.. ఇప్పటివరకు ఇంగ్లాండ్ గడ్డపై 1000సెంచరీలు నమోదు కావడం విశేషం. ఇందులో 836టెస్టు సెంచరీలు, 163వన్డే సెంచరీలు, మిగిలినవి టీ20ల్లో నమోదైనవి.

ఇప్పటికీ బద్దలవని రికార్డు:

ఇప్పటికీ బద్దలవని రికార్డు:

ఛాంపియన్స్ ట్రోఫీలో బెస్ట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న శిఖర్ ధావన్-రోహిత్ శర్మల కన్నా మరో జోడి మెరుగైన రికార్డు కలిగి ఉంది. ఈ ట్రోఫీలో 2006లో క్రిస్ గేల్-శివనారాయణ్ చంద్రపాల్ నమోదు చేసిన 512పరుగుల భాగస్వామ్యమే ఇప్పటిదాకా 'ది బెస్ట్'గా నిలుస్తూ వస్తోంది. కాగా, ప్రస్తుత ట్రోఫీలో శిఖర్ ధావన్-రోహిత్ శర్మల జోడీ 384పరుగుల భాగస్వామ్యాలను నెలకొల్పిన సంగతి తెలిసిందే.

కెప్టెన్సీ లేకుండా 300వన్డేలు:

కెప్టెన్సీ లేకుండా 300వన్డేలు:

కెప్టెన్సీ చేయకుండా 300వన్డేలు ఆడిన రెండో ఆటగాడిగా టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ నిలిచాడు. యువరాజ్ కన్నా ముందు ముత్తయ్య మురళీధరన్ ఈ ఫీట్ సాధించాడు. ఈ శ్రీలంకన్ స్పిన్నర్ కెప్టెన్సీ లేకుండా 350వన్డేలు ఆడాడు. అలాగే సచిన్ టెండూల్కర్, గంగూలీ, రాహుల్ ద్రావిడ్, అజారుద్దీన్ ల తర్వాత ఇండియా తరుపున 300ల వన్డేలు ఆడిన క్రికెటర్ యువరాజ్ సింగే కావడం గమనార్హం.

రిక్కీ పాటింగ్ తర్వాత ఐసీసీ ఈవెంట్లలో ఇండియాపై ఎక్కువసార్లు యాభై కన్నా ఎక్కువ స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా తమీమ్ ఇక్బాల్ నిలిచాడు. ఐసీసీ ఈవెంట్లలో రిక్కీ పాంటింగ్ ఇండియాపై నాలుగుసార్లు యాభై కన్నా ఎక్కువ స్కోరు నమోదు చేయగా.. తమీమ్ మూడుసార్లు ఆ ఫీట్ సాధించాడు.

శిఖర్-రోహిత్ పెయిర్ కు సాటి లేదు:

శిఖర్-రోహిత్ పెయిర్ కు సాటి లేదు:

ఛాంపియన్స్ ట్రోఫిలో ఇప్పటిదాకా యాభై పరుగుల కన్నా ఎక్కువగా నమోదైన భాగస్వామ్యాలు కేవలం 5మాత్రమే కాగా.. భారత ఓపెనింగ్ జోడి దాన్ని అధిగమించింది. ధావన్-రోహిత్ పెయిర్ ఇప్పటివరకు 7సార్లు అర్థసెంచరీకి పైగా భాగస్వామ్యాలు నెలకొల్పారు.

ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో 680పరుగులు నమోదు చేసి సత్తా చాటిన ధావన్.. ఈ ట్రోఫీలో ఎక్కువ పరుగులు చేసిన నాలుగో వ్యక్తిగా నిలిచాడు. ధావన్ కు ముందు వరుసలో విండీస్ వీరుడు క్రిస్ గేల్, శ్రీలంక ద్వయం మహేల జయవర్దనే-కుమార సంగక్కర ఉన్నారు.

ఆస్ట్రేలియా-ఇండియాకే ఆ ఘనత

ఆస్ట్రేలియా-ఇండియాకే ఆ ఘనత

తాజా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ కు వెళ్లడంతో.. ఐసీసీ ఈవెంట్లలో 10సార్లు ఫైనల్ కు చేరుకున్న జట్టుగా భారత్ నిలిచింది. భారత్ కన్నా ముందు ఆస్ట్రేలియా ఆ ఫీట్ సాధించింది. ఈ రెండు జట్లు మినహా మరే జట్టు ఈ ఫీట్ సాధించలేకపోయింది.

ఇక భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా ఈ ట్రోఫీ ద్వారా.. పేసర్ జహీర్ ఖాన్ పై ఉన్న రికార్డును అధిగమించాడు. గతంలో జహీర్ ఖాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో 15వికెట్లు తీయగా.. జడేజా 16వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A match-winning century from Rohit Sharma helped India set up a final clash against Pakistan after beating Bangladesh by nine wickets in the semi-final of the ICC Champions Trophy 2017 at Edgbaston with 59 balls to spare.
Please Wait while comments are loading...