ఐసీసీ టోర్నీలు: సచిన్‌ రికార్డును బద్దలు కొట్టిన ధావన్‌

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ టోర్నీల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీల రికార్డులను సైతం బద్దలు కొట్టాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు  | స్కోరు కార్డు 

టోర్నీలో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 83 బంతుల్లో 78 పరుగులు చేసిన ధావన్ భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ధావన్‌కి ఇది 19వ అర్ధ సెంచరీ. అంతేకాదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇది ధావన్‌కు నాలుగో అర్ధ సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ధావన్ 90.3 యావరేజితో 271 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి.

Shikhar Dhawan Breaks Sachin’s Record in ICC’s 50-Over Tournaments

ఐసీసీ నిర్వహించిన టోర్నీల్లో కేవలం 16 ఇన్నింగ్స్‌ల ద్వారానే ధావన్‌ వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. 69.72 యావరేజితో 1046 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. దీంతో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా ధావన్‌ సరికొత్త రికార్డును సృష్టించాడు.

గతంలో సచిన్‌ 18 ఇన్నింగ్స్‌ల ద్వారా, గంగూలీ, మార్క్‌ వా 20 ఇన్నింగ్స్‌ల ద్వారా వెయ్యి పరుగులు పూర్తి చేశారు. ఇదిలా ఉంటే ధావన్‌ తన కెరీర్‌లో మొత్తం 79 మ్యాచుల్లో 78 ఇన్నింగ్స్‌ల ద్వారా 3,711 పరుగులు సాధించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Three innings in the 2017 Champions Trophy and Shikhar Dhawan has amassed a total of 271 runs, including two half-centuries and a ton at an average of 90.3. Enroute his 78 off 83 on Sunday against South Africa, Dhawan went past Sachin Tendulkar and became the quickest to reach 1,000 runs in ICC organised 50-over matches.
Please Wait while comments are loading...