ఎఫ్‌ 16 అంటే ఇష్టం: షోయబ్ అక్తర్ సంబరాల వెనుక రహస్యం ఇదే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మైదానంలో వికెట్ తీసినా లేక సెంచరీ చేసిన ఆటగాళ్లు తమదైన శైలిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటారు. సెంచరీ కొట్టిన బ్యాట్స్‌మెన్ హెల్మెట్ తీసి ఒక చేతిలో హెల్మెట్ మరొక చేతితో బ్యాట్‌ని ఆకాశంలోకి చూపడం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం.

అయితే యువ క్రికెటర్లు మాత్రం తమ ఆనందాన్ని వ్యక్తం చేయడంతో కొత్త పద్ధతులను వెతుకుతున్నారు. రాజ్‌పుత్‌ కుటుంబానికి చెందిన రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ లేదా సెంచరీ సాధించినప్పుడు తన బ్యాట్‌ని కత్తిలాగా తిప్పుతూ మైదానంలో సందడి చేస్తుంటాడు.

జట్టు సహచరులు సైతం జడేడా కత్తి విన్యాసానికి ముగ్దులవుతుంటారు. తన బౌలింగ్‌తో ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లను హడలెత్తించిన పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మాత్రం వికెట్‌ తీస్తే మైదానంలో తనదైన శైలిలో సంబరాలు చేసుకునేవాడు.

తాజాగా అక్తర్‌ తన సంబరాల వెనుక ఉన్న రహస్యాన్ని అభిమానులతో ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. 'వికెట్‌ తీసిన తర్వాత మైదానంలో యుద్ధ విమానంలా చక్కెర్లు కొడతా. ఎందుకంటే నాకు ఆ విమానాలంటే చాలా ఇష్టం. ఎఫ్‌ 16 ఎంతో ప్రత్యేకం' అని ట్వీట్ చేశాడు.

'నా చిన్నతనంలో మా ఇంటిపై నుంచి మిరాజ్‌, ఎఫ్‌-16 తదితర విమానాలు శబ్ధం చేస్తూ వెళ్లేవి. ఆ శబ్ధం నాకు చాలా ప్రత్యేకంగా అనిపించేది' అని అక్తర్‌ వెల్లడించడం విశేషం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pakistan's Shoaib Akhtar was widely regarded as one of the fastest and most lethal bowlers in the world. His fearsome pace saw many batsmen retiring hurt after being hit by his deliveries. But the fiery pace merchant is remembered more for his 'flying' celebration after taking a wicket.
Please Wait while comments are loading...