ప్రపంచ క్రికెట్‌లోనే తొలిసారి: ఒకే మ్యాచ్‌లో ట్రిప్లెట్స్‌

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే రోజు పుట్టిన ముగ్గురు సోదరులు (ట్రిప్లెట్స్‌) ఒకే మ్యాచ్‌లో కలిసి బరిలోకి దిగిన అరుదైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. నెదర్లాండ్స్, యూఈఏ ఇందుకు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే దీనికి వేదికగా నిలిచింది.

మూడు రోజుల వన్డే సిరిస్లో భాగంగా నెదర్లాండ్స్‌ తరఫున 20 ఏళ్ల సికందర్‌ జుల్ఫిఖర్, అసద్‌ జుల్ఫిఖర్, సాఖిబ్‌ జుల్ఫికర్‌ ఈ మ్యాచ్‌లో ఆడారు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి అరుదైన ఘనత మొట్టమొదటి సారి చోటు చేసుకోవడం గమనార్హం.

ఈ ముగ్గురిలో సికందర్‌ ఇప్పటికే 2 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడగా... అసద్, సాఖిబ్‌లకు ఇదే తొలి మ్యాచ్‌ కావడం విశేషం. మార్చి 28, 1997న పుట్టిన ఈ ముగ్గురు పాకిస్థాన్‌ సంతతికి చెందినవారు. పాక్‌లోని సియాల్‌కోట్‌కు చెందిన వీరి తండ్రి జుల్ఫిఖర్‌ అహ్మద్‌ చాలా ఏళ్ల క్రితమే నెదర్లాండ్స్‌లో స్థిరపడ్డారు.

Sikander, Asad and Saqib Zulfiqar become cricket’s first set of triplets

1991 నుంచి 2002 మధ్య కాలంలో 9 లిస్ట్‌ ఎ మ్యాచ్‌లలో నెదర్లాండ్స్‌ జట్టు తరఫున బరిలోకి దిగారు. ఇందులో 2000 ఐసీసీ ట్రోఫీ ప్రత్యేకం. 1966లో సియోల్ కోట్‌లో జన్మించిన జుల్ఫిఖర్‌ అహ్మద్‌ 21 ఏళ్ల వయసులో నెదర్లాండ్స్‌కు వెళ్లారు. 1990లో అక్కడి డొమెస్టిక్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.

అదే అనుభవంతో ఆయన తన ముగ్గురు పిల్లలను క్రికెట్‌లో ప్రోత్సహించారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో 183 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 3 వికెట్ల తేడాతో గెలిచింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Since the Netherlands-UAE game holds only List A status, the three brothers became the first set of triplets to feature in a professional game together. However, they might not take much time to become the first triplets set to play in an International game if they back their spot with some consistent performances.
Please Wait while comments are loading...