టెస్టు సస్పెన్షన్: కవిత రూపంలో స్పందించిన రవీంద్ర జడేజా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఐసీసీ టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ఓ టెస్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టు ఇన్నింగ్స్ 58వ ఓవర్‌లో తిలకరత్నేపై ప్రమాదకరంగా బంతిని విసిరిన నేపథ్యంలో జడేజాపై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.

ఈ నేపథ్యంలో జడేజా తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా స్పందించాడు. "నేను మంచిగా మారాలనుకున్నప్పుడు... ప్రపంచం మొత్తం నన్ను సంచలనానికి కేంద్రబిందువుగా మార్చింది" అని ట్వీట్ చేశాడు.

రెండో టెస్టులో అటు బ్యాట్‌తోనూ, బంతితోనూ రవీంద్ర జడేజా రాణించిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో 70 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో పాటు 7 వికెట్లు (రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి) తీసి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుకి ఎంపికయ్యాడు. మ్యాచ్‌ అనంతరం జడేజా అవార్డుతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

'నిద్రపోతున్న సమయంలో వచ్చేవి కలలు కాదు. నిద్రపట్టకుండా చేసేవి కలలు. హార్డ్‌వర్క్‌.' అని పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే ఐసీసీ నిబంధలను ఉల్లంఘించినందుకు ఐసీసీ సస్పెన్షన్‌ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆగస్టు 12 నుంచి పల్లెకెలెలో ప్రారంభం కానున్న మూడో టెస్టుకి రవీంద్ర జడేజా దూరమయ్యాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ravindra Jadeja, who has been handed a one-Test ban after accumulating six demerit points in a 24-month period post the conclusion of the second India vs Sri Lanka Test, on Monday threw the cricket fraternity in a tizzy with a sarcastic tweet.
Please Wait while comments are loading...