కోహ్లీ రికార్డు బద్దలు: కొత్త స్పోర్ట్స్ స్టార్‌గా స్మృతి మందాన

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. కోహ్లీ ఆటతీరుతో మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం ఫిదా అయ్యారు. కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

కోహ్లీ ఫేస్‌బుక్‌ పేజీని ప్రస్తుతం 3.59 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ (4.22 కోట్లు) తర్వాత ఎక్కువ మంది ఫాలో అవుతున్నది కోహ్లీనే. అలాంటి కోహ్లీ ఫాలోయింగ్ రికార్డుని భారత మహిళా క్రికెటర్ అధిగమించింది. జులైలో స్మృతి మందాన ఫేస్‌బుక్‌ పేజీని 56,255 మంది లైక్‌ చేశారు.

Smriti Mandhana beats Virat Kohli and now owns the fastest growing sports star title

ముఖ్యంగా లండన్ వేదికగా ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత స్మృతి మందానకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. దీంతో ఆమెను ఫేస్‌బుక్‌లో అనుసరిస్తున్న వారి సంఖ్య దాదాపు ఏడు లక్షలకు చేరువైంది. దీంతో ఆమెను 'అత్యంత వేగంగా ఎదుగుతున్న స్పోర్ట్స్ స్టార్'గా అభివర్ణించారు.

మరోవైపు జులైలో స్మృతి ఫ్యాన్‌ ఫాలోయింగ్ 710.01 శాతం పెరగ్గా కోహ్లీ పేజీ రేట్‌ మాత్రం 0.18 శాతంగా ఉంది. జులైలో లండన్ వేదికగా జరిగిన ఉమెన్ వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా ఓపెనర్‌ సృతి మంధాన ఇంగ్లాండ్‌పై 90, వెస్టిండిస్‌పై సెంచరీ సాధించి అభిమానుల సంఖ్యను అమాంతం పెంచుకుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
She is currently challenging India Men’s team captain Virat Kohli in the popularity charts on social media. Virat Kohli is the second most liked Indian celebrity on social media, first being the Prime Minister of India, Shri Narendra Modi. He has staggering 35,872,936 fans on his official Facebook page, making him the most popular Indian cricketer on Facebook.
Please Wait while comments are loading...