కనీస పోటీని ఇవ్వలేదు: దక్షిణాఫ్రికా ఆటతీరుపై స్మిత్ మండిపాటు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చెత్త ప్రదర్శనపై ఆ జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్‌ స్మిత్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కనీస పోటీని ఇవ్వలేకపోవడం ఆహ్వానించదగిన విషయం కాదని పేర్కొన్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు  | స్కోరు కార్డు 

దక్షిణాఫ్రికా జట్టు ప్రదర్శన ఆశ్యర్యానికి గురిచేసిందని మ్యాచ్ అనంతరం ఐసీసీకి రాసిన కాలమ్‌లో రాసుకొచ్చాడు. అదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది.

South Africa were unrecognisable against India: Smith

భారత బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధవాన్ 78, కోహ్లీ 76(నాటౌట్), యువరాజ్ సింగ్ 23(నాటౌట్), రోహిత్ శర్మ 12 పరుగులు చేశారు. అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాప్రికా 44.3 ఓవర్లకు 191 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తాజా విజయంతో టీమిండియా సెమీస్‌కు చేరగా, దక్షిణాఫ్రికా టోర్నీ నుంచి వైదొలగింది.

దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భారత పేస్‌ బౌలర్లు బుమ్రా, భువనేశ్వర్‌లపై విరుచుకుపడతానని తాను ఊహించానని తెలిపాడు. అయితే అందుకు భిన్నంగా తమ ఆటగాళ్లే ఒత్తిడికి లోనై తగిన మూల్యం చెల్లించుకున్నారని అభిప్రాయపడ్డాడు. తమ ఇన్నింగ్స్‌లో రెండు రనౌట్లు కావడం ఆటగాళ్లను ఒత్తిడికి గురి చేసిందని చెప్పాడు.

ఇక లక్ష్య చేధనలో కోహ్లీ సేన ఆడిన తీరు అద్భుతమైని స్మిత్ కొనియాడాడు. దక్షిణాఫ్రికా జట్టుపై సరైన ప్రణాళికలతో రాణించారని పేర్కొన్నాడు. భారత్‌ ఫైనల్‌ ఫేవరేట్‌ అని బంగ్లాతో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీసేన నెగ్గుతుందని స్మిత్‌ జోస్యం చెప్పాడు. కాగా, టీమిండియాతో మ్యాచ్‌కు ముందు స్మిత్‌ దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు విలువైన సూచనలు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dismayed by South Africa's capitulation, former skipper Graeme Smith said the Proteas were simply "unrecognisable" during their timid loss to India in the do-or-die Champions Trophy clash.
Please Wait while comments are loading...