రిషబ్ పంత్ క్యాచ్: డేవిడ్ వార్నర్‌కు పట్టేసిన పక్కటెముకలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఐపీఎల్, మ్యాచ్ 21: సన్‌రైజర్స్ జైత్రయాత్ర, ఢిల్లీపై ఘన విజయం

ఈ సీజన్‌లో మధ్యలో రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైనప్పటికీ, ఆ తర్వాత ను కొనసాగిస్తోంది. 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్ మొదటి నుంచే దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో యువీ వేసిన పదో ఓవర్‌లో రిషబ్‌ పంత్‌ ఇచ్చిన క్యాచ్‌ను వార్నర్‌ ప్రమాదకరరీతిలో అందుకున్నాడు.

ఫోర్ లైన్ వద్ద పూర్తిగా వెనుకకు పడిపోతూ ఈ క్యాచ్‌‌ను ఒడిసిపట్టాడు. ఈ సందర్భంగా వార్నర్ బాధ పడుతున్నట్టు టీవీ కెమెరాల్లో కనిపించింది. అయితే మ్యాచ్‌ అయిపోయేవరకు ఈ బాధను ఓర్చుకున్న వార్నర్‌, మ్యాచ్ అనంతరం ఈ విషయాన్ని వెల్లడించాడు.

SRH vs DD: I hurt myself on the rib cage, reveals David Warner

ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టులో యువ ఆటగాళ్లు సంజూ శాంసన్, రిషబ్‌ పంత్ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో రిషబ్ పంత్ క్యాచ్ ఎంతో విలువైనది కావడంతో కష్టమైన వార్నర్ దానిని ఒడిసిపట్టుకున్నాడు. దీంతో పక్కటెముకల్లో గాయమైందని వార్నర్ వెల్లడించాడు.

ఐపీఎల్, మ్యాచ్ 21: సన్‌రైజర్స్ Vs ఢిల్లీ మ్యాచ్ హైలెట్స్

ఈ సందర్భంగా హైదరాబాద్‌ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని డేవిడ్‌ వార్నర్‌ ప్రశంసల్లో ముంచెత్తారు. కేన్‌ విలియమ్సన్‌, శిఖర్‌ ధావన్‌ ఈ మ్యాచ్‌లో గొప్ప ఆటతీరు కనబర్చారని వార్నర్ కితాబిచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన విలియమ్సన్‌ 89, ధావన్‌ 70 పరుగులతో రాణించడంతో హైదరాబాద్‌ 191 పరుగులు చేసింది.

192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన డేర్ డెవిల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులుచేసి ఓటమిపాలైంది. బ్యాట్సమెన్‌తోపాటు బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారని, అందువల్లే ఈ విజయం వరించిందని వార్నర్ చెప్పారు.

ముఖ్యంగా చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 24 పరుగులు అవసరం కాగా, సన్ రైజర్స్ బౌలర్ కౌల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 8 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. మరోవైపు 15 పరుగుల తేడాతో ఓడిపోవడంపై జహీర్‌ ఖాన్‌ విచారం వ్యక్తం చేశాడు. రెండు జట్లు బాగా ఆడాయని ఆయన చెప్పుకొచ్చాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sunrisers Hyderabad captain David said he hurt himself while taking a catch but heaped praise on his players for his side's 15-run win over Delhi Daredevils here on Wednesday.
Please Wait while comments are loading...