మురళీ విజయ్‌ని తిట్టిన స్మిత్: ఇంటర్నెట్‌లో వైరల్ (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్టు సిరిస్‌లో వివాదాలకు కొదవ లేకుండా పోయింది. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లు అయిన భారత్‌-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌ అంటే సహజంగానే మైదానంలో హోరాహోరీ పోరు ఉంటుందని అందరూ భావించారు.

అందుక తగ్గట్టే ఇరు జట్ల తమ ప్రదర్శనను కొనసాగిస్తున్నాయి. అయితే అదే స్ధాయిలో వివాదాలు కూడా ఇరు జట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బెంగుళూరు టెస్టులో డీఆర్‌ఎస్‌ రివ్యూ కోసం స్మిత్‌ డ్రెసింగ్‌ రూమ్‌ సలహాలు తీసుకోవడం పెద్ద దుమారమే రేపింది. చివరకు ఐసీసీ రంగంలోకి దిగి ఇరు బోర్డుల మధ్య సయోధ్య కుదిర్చింది.

ఆ తర్వాత జరిగిన రాంచీ టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ భుజానికి గాయమవ్వగా ఆసిస్‌ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ కోహ్లీని వెక్కిరించడం... కోహ్లీ కూడా అదే స్థాయిలో సమాధానమివ్వడం మనకు తెలిసిందే. తాజాగా ధర్మశాలలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్... ఓపెనర్ మురళీ విజయ్‌ని దూషించి వార్తల్లో నిలిచాడు.

మురళీ విజయ్‌ చీట్‌ చేశాడని స్మిత్ ఆగ్రహం

మురళీ విజయ్‌ చీట్‌ చేశాడని స్మిత్ ఆగ్రహం

ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా జోష్‌ హాజెల్‌వుడ్‌ క్యాచ్‌ విజయంలో మురళీ విజయ్‌ చీట్‌ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో హాజల్‌వుడ్‌ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న మురళీ విజయ్‌ అందుకున్నాడు. ఇది చివరి వికెట్‌ కావడంతో భారత్‌ సంబరాల్లో మునిగింది.

థర్డ్‌ ఎంపైర్‌కు నివేదించిన ఫీల్డ్ అంపైర్లు

థర్డ్‌ ఎంపైర్‌కు నివేదించిన ఫీల్డ్ అంపైర్లు

దీంతో ఎటూ తేల్చుకోలేకపోయిన అంఫైర్లు థర్డ్‌ ఎంపైర్‌కు నివేదించారు. టీవీ రీప్లేలో బంతి ముందుగా నేలను తాకినట్టుగా తేలడంతో నాటౌట్‌గా ప్రకటించారు. అయితే హాజెల్‌వుడ్‌ అవుట్ అని భావించిన విజయ్‌... అది చివరి వికెట్‌ కావడంతో రెండో ఇన్నింగ్స్‌కు ప్యాడ్లు కట్టి రెడీ అయ్యేందుకు డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లాడు.

రివ్యూలో నాటౌట్

అదే సమయంలో థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ ఇవ్వడంతో అంతా తిరిగి మైదానంలోకి వచ్చారు. అయితే విజయ్‌ అత్యుత్సాహంగా ముందుగానే పెవిలియన్‌కు చేరడాన్ని స్మిత్‌ సహించలేకపోయాడు. విజయ్‌ను ఉద్దేశించి (ఫ.. చీట్‌) అంటూ దారుణంగా నోరుపారేసుకున్నాడు. డ్రెసింగ్‌ రూమ్‌లో అతని ఆగ్రహం, దుర్భాషలాడటం కెమెరా కంటికి చిక్కింది.

స్మిత్‌ తీరుపై విమర్శలు

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. స్మిత్‌ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్మిత్‌ వ్యవహారశైలిపై మ్యాచ్‌ రిఫరీకి ఫిర్యాదు చేయాలని భారత బృందం భావిస్తోంది. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 137 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్‌కు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Day three also had its share of drama when Murali Vijay claimed a catch off Josh Hazlewood at the fag end of the Australian innings. Replays, however, showed the ball had spilled onto the grass.
Please Wait while comments are loading...