కోహ్లీపై స్టీవ్ వా ఆసక్తికర వ్యాఖ్యలు: ఏమన్నాడంటే....

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయని చెప్పాడు. తనలో, పాంటింగ్‌లో ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలు కోహ్లీ నాయకత్వంలో ఉన్నాయని అన్నాడు.

మైదానంలో కోహ్లీ కదలికలు, ప్రవర్తన చాలా బాగుంటాయని చెప్పాడు. కోహ్లీ భారత క్రికెట్‌కు సరికొత్త ఆటగాడని స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు. కోహ్లీ చురుకైన నాయకత్వ లక్షణాలను ఆయన ప్రశంసించారు. కోహ్లీ దూకుడుగా వ్యవహరిస్తాడని, సానుకూల వైఖరితో కోహ్లీ ఉంటాడని ఆయన అన్నారు.

Steve Waugh: There are elements of Ricky Ponting and me in Virat Kohli

అతను జట్టును నడిపించే తీరు జట్టు నుంచి అతనికి ఏం కావాలో చెబుతుందని వా అన్నాడు. తనలోని కొన్ని లక్షణాలు కోహ్లీలో ఉండడం తనకు ఆనందంగా ఉందని కూడా అన్నాడు.

తన జట్టు సభ్యులతో ఎక్కువగా మాట్లాడుతూ వారిని కోహ్లీ ప్రోత్సహిస్తూ ఉంటాడని, దూకుడుగా ఉంటాడని, అతనిది పాజిటీవ్ బాడీ లాంగ్వేజ్ అని అన్నారు. మైదానంలో చురుగ్గా కదలడం ద్వారా పాంటింగ్ ఎలాగైతే ఇతరులకు మార్గదర్శనం చేశాడో కోహ్లీ కూడా అలాగే చేస్తున్నాడని అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Australia captain Steve Waugh has praised Virat Kohli for his proactive leadership qualities saying that he sees a bit of Ricky Ponting and himself in the way the Indian goes about his business.
Please Wait while comments are loading...