ధర్మశాలలో దలైలామాను కలిసిన ఆసీస్ కెప్టెన్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా చివరి టెస్టు శనివారం ధర్మశాలలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఆడడానికి అక్కడికి చేరుకున్న ఆసీస్ ఆటగాళ్లు బౌద్ధమత గురువు ద‌లైలామాను క‌లిశారు. కెప్టెన్ స్టీవ్ స్మిత్‌, ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌, స్పిన్న‌ర్ నాథన్ లియాన్‌లతో పాటు ఇత‌ర జట్టు స‌భ్యులు ఆయ‌నను క‌లిసిన‌ వారిలో ఉన్నారు.

Steven Smith Has a Peace Session With The Dalai Lama

ఈ సందర్భంగా స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ దలైలామాను కలవడం సంతోషంగా ఉందని అన్నాడు. అత్యంత ఒత్తిడికి గురిచేస్తున్న నాలుగో టెస్టు సమయంలో ప్రశాంతంగా ఎలా నిద్రపోవాలో ఆయనను అడిగి తెలుసుకున్నట్లు స్మిత్ చెప్పాడు. 'చాలా సంతోషంగా ఉంది. నిద్ర గురించి అడిగాను. నేను ప్రశాంతంగా నిద్రపోయేందుకు ఏమైనా సాయం చేయగలరా అని ప్రశ్నించాను. ఆశీస్సులు కోరాను. మేమిద్దరం మా ముక్కులు రాసుకొన్నాం. ఆయన నాకు ఆశీస్సులు అందించారు. ఈ ఐదు రోజులు ప్రశాంతంగా నిద్ర పడుతుందని ఆశిస్తున్నా' అని స్మిత్‌ అన్నాడు.

Steven Smith Has a Peace Session With The Dalai Lama

ద‌లైలామా ముందు కూర్చొని ఆయ‌న‌ చేసిన బోధ‌న‌ల‌ విన్నారు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇరు జట్లు చెరో టెస్టుని గెలిచాయి. దీంతో సిరిస్ 1-1తో సమమైంది.

Steven Smith Has a Peace Session With The Dalai Lama

రాంచీలో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో ఈ సిరిస్ ఫలితాన్ని తేల్చే చివరి టెస్టు కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It has been an intense series so far with tempers flying high both on and off the pitch with Australia skipper Steven Smith and India skipper Virat Kohli leaving no stones unturned to engage in ‘war of words’. But Smith now wants some peace of mind and took time out to meet the Dalai Lama and listen to him speak at his temple in Dharmsala on Friday.
Please Wait while comments are loading...