ఫిట్‌నెస్ పరీక్షలు ముగిశాయి: లంక పర్యటనకు సిద్ధమైన ధోనీ, రైనా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ అనంతరం ఆగస్టు 20 నుంచి ఇరు జట్ల మధ్య ఐదు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. వన్డే సిరిస్‌లో పాల్గొనబోయే భారత జట్టుని ఆదివారం సెలక్టర్లు ప్రకటించనున్నారు.

ఇదిలా ఉంటే వన్డే సిరిస్‌కి జడేజా, అశ్విన్‌, మహ్మద్‌ షమికి బీసీసీఐ విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమయ్యాడు. దీంతో లంకతో జరిగే వన్డే సిరిస్‌కు ధోనీ, సురేశ్‌ రైనా, కేదార్‌ జాదవ్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించారు.

ఈ మేరకు ధోనీ బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)లో ట్రయినింగ్ అనంతరం జట్టు సహచరులతో కలిసి దిగిన ఫొటోని తన ఇన్‌స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'ఎన్‌సీఏ అన్ని పరీక్షలు అయిపోయాయి. 20 మీటర్ల పరుగును 2.91 సెక్లన్లలో ముగించా. లంచ్ సమయం ఆసన్నమైంది' అని ధోని కామెంట్ పోస్టు చేశాడు.

NCA all test's done.20 mtr in 2.91sec. Run a 3 done in 8.90sec.time for heavy lunch

A post shared by @mahi7781 on Aug 10, 2017 at 11:34pm PDT

మరోవైపు నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)లో ట్రయినింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను సురేశ్ రైనా తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. రైనా తన చివరి వన్డేని 2015 అక్టోబరులో దక్షిణాఫ్రికాపై ఆడాడు. ఐదు వన్డేల సిరీస్‌లో ఎవరు చోటు దక్కించుకున్నారో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mahendra Singh Dhoni has been out of the limelight for quite a while now, ever since India left for Sri Lanka for the Test series. As for Suresh Raina, he has been out of action for even longer, not being visible since the end of the Indian Premier League (IPL).
Please Wait while comments are loading...