అరుదైన గౌరవం: అంకుల్ పెర్సికి కోహ్లీ సేన బహుమతి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీ సేన ప్రస్తుతం శ్రీలంకలో పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టు ఆదివారంత ముగిసింది. ఈ టెస్టులో ఆతిథ్య శ్రీలంకపై
ఇన్నింగ్స్‌ 53 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

2-0తో సిరిస్‌ను కైవసం

2-0తో సిరిస్‌ను కైవసం

ఈ విజయంతో మరో టెస్టు మిగిలుండగానే 2-0తో సిరిస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరిస్ విజయంతో శ్రీలంక గడ్డపై రెండు టెస్ట్ సిరీస్‌లు గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 2015లో మొదటిసారి 2-1తో లంకపై సిరిస్ గెలిచిన కోహ్లీ సేన తాజా టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకుంది.

అంకుల్‌ పెర్సికి కోహ్లీసేన అరుదైన కానుక

అంకుల్‌ పెర్సికి కోహ్లీసేన అరుదైన కానుక

ఈ నేపథ్యంలో కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టు అనంతరం శ్రీలంక జట్టు సూపర్ ఫ్యాన్ అంకుల్‌ పెర్సికి కోహ్లీసేన అరుదైన కానుకను అందజేసింది. ఇంతకీ అంకుల్‌ పెర్సి ఎవరా అనుకుంటున్నారా! టీమిండియా ఎక్కడ మ్యాచ్‌ ఆడినా త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని గ్యాలరీలో భారత క్రికెటర్లను ఉత్సాహపరచడం మనం చూశాం.

అంకుల్ పెర్సి వయసు 81 ఏళ్లు

అంకుల్ పెర్సి వయసు 81 ఏళ్లు

అదే విధంగా శ్రీలంకకు అంకుల్‌ పెర్సి. అంకుల్ పెర్సి వయసు 81 ఏళ్లు. ఈ వయసులో కూడా శ్రీలంక ఎక్కడ మ్యాచ్‌ ఆడినా ఆ దేశ జాతీయ పతాకంతో సందడి చేస్తుంటాడు. పెర్సికి టీమిండియా అంటే కూడా గౌరవం. అంతేకాదు భారత జట్టులో కోహ్లీ, రహానె, రైనా, రవిశాస్త్రి తదితరులంటే చెప్పలేనంత ఇష్టం.

ఆగస్టు 12న పల్లెకెలెలో మూడో టెస్టు

ఆగస్టు 12న పల్లెకెలెలో మూడో టెస్టు

ఈ క్రమంలోనే గాలెలో తొలి టెస్టు అనంతరం కోహ్లీ, ధావన్‌.. పెర్సిని కలిసి ముందస్తుగానే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జట్టులోని ఆటగాళ్లతో పాటు కోచ్‌ రవిశాస్త్రి సంతకం చేసిన జెర్సీని శాస్త్రి.. పెర్సికి అందించాడు. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు ఆగస్టు 12న పల్లెకెలెలో ప్రారంభం కానుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Team India registered an emphatic win over the hosts Sri Lanka in the second Test of the 3-match Test series. The win at Colombo has ensured that the Indian team has an unassailable lead in the series. Soon after the win, the Virat Kohli-led side made a very sweet gesture for one of the most iconic fans of Sri Lankan cricket – Uncle Percy. Uncle Percy is one of the most prominent names among the cricket fanatics.
Please Wait while comments are loading...