ప్రాక్టీస్ సెషన్‌: కోహ్లీ, యువీ, ధావన్ ఫన్నీ డ్యాన్స్ (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం రెండో సెమీ ఫైనల్లో భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే ఈ సెమీ పైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు బాగా ఎంజాయ్ చేశారు.

మ్యాచ్ తాలూకు ఒత్తిడి ఏమాత్రం లేకుండా ప్రాక్టీస్ సెష‌న్‌లో డ్యాన్స్ చేస్తూ క‌నిపించారు. కెప్టెన్ విరాట్ కోహ్లితోపాటు ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌, యువ‌రాజ్‌ వెరైటీ స్టెప్పు లేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించి టీమిండియా సెమీస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

ఎడ్జిబాస్టన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌పై ఎలాంటి ఒత్తిడి లేదని.. అంతమాత్రానా వారిని తక్కువ అంచనా వేయడం లేదని కోహ్లీ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు జూన్ 18(ఆదివారం) నాడు పైనల్లో పాకిస్థాన్‌తో తలపడనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Team india players share light moments during practice session in birmingham.
Please Wait while comments are loading...