విరాట్ కోహ్లీ సందేశం: అఫ్రిదికి టీమిండియా అరుదైన గిప్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన పాకిస్థాన్ క్రికెట‌ర్‌ షాహిద్ అఫ్రిదికి టీమిండియా ప్లేయ‌ర్స్ ఓ అరుదైన గిఫ్ట్ ఇచ్చారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ టీషర్ట్‌పై జట్టు ప్లేయర్లంతా సంతకాలు చేసిన దానిని అప్రిదికి పంపించారు.

ఈ గిప్ట్‌పై విరాట్ కోహ్లీ ఓ సందేశాన్ని కూడా రాశాడు. 'షాహిద్ భాయ్‌.. బెస్ట్ విషెస్‌.. నీతో ఆడ‌టం ఎప్పుడూ నాకు సంతోష‌మే' అని విరాట్ కోహ్లీ ఓ సందేశం రాశాడు. దీనికి సంబంధించిన ఫొటోను పాకిస్థానీ జ‌ర్న‌లిస్ట్ పైజాన్ లఖానీ ట్విట్ట‌ర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

ఈ గిప్ట్‌పై విరాట్ కోహ్లీతోపాటు యువ‌రాజ్‌ సింగ్, ఆశిష్ నెహ్రా, బుమ్రా, రైనా, ప‌వ‌న్ నేగి, షమి, జ‌డేజా, భువ‌నేశ్వ‌ర్‌, ర‌హానే, ధావ‌న్‌, అశ్విన్‌, పాండ్యా, అప్ప‌టి కోచ్ ర‌విశాస్త్రి ఆటోగ్రాఫ్‌లు ఉన్నాయి. ఐసీసీ వరల్డ్ కప్ 2015 తర్వాత అప్రిది టెస్టు, వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

ఆ తర్వాత 2106లో ఐసీసీ వరల్డ్ టీ20లో పాకిస్థాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. చివరకు ఫిబ్రవరి 20, 2017లో టీ20ల నుంచి కూడా వైదొలగుతున్నట్లు అప్రిది ప్రకటించాడు. 1996లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అప్రిది 27టెస్టులు (1716 పరుగులు), 398 వన్డేలు (8064 పరుగులతో పాటు 395 వికెట్లు), 98 టీ20ల్లో (1405 పరుగులతో పాటు 97 వికెట్లు) తీశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a great gesture, the Indian Cricket team have sent Virat Kohli's national team jersey signed by every player to Shahid Afridi as a token of respect.
Please Wait while comments are loading...