మార్చి 2018: శ్రీలంక, బంగ్లాతో భారత్ ముక్కోణపు టీ20 సిరీస్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మార్చి 2018లో టీమిండియా శ్రీలంకలో పర్యటించే అవకాశం ఉంది. ఆతిథ్య శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్‌తో కలిసి టీమిండియా ముక్కోణపు టీ20 సిరీస్ ఆడనుంది. ఇదిలా ఉంటే శ్రీలంక కూడా వచ్చే ఏడాది భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉంది.

ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక 3 టెస్టులు, 5 వన్డేలు, 2 టీ20 మ్యాచ్‌లను భారత్‌తో ఆడనుంది. అయితే ఈ పర్యటనలకు సంబంధించి అధికారికంగా నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐసీసీ సమావేశంలో బీసీసీఐకి మద్దతుగా శ్రీలంక బోర్డు నిలిచిన సంగతి తెలిసిందే.

Team India to tour Sri Lanka for T20 tri-series in March 2018; Bangladesh 3rd team

కాగా ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు అక్కడికి వెళ్లింది. ఇప్పటికే ముగిసిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 259 పరుగుల తేడాతో లంక చేతిలో ఓటమి పాలైంది. ప్రస్తుతం బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India will be touring Sri Lanka in March, 2018 to play a tri-nation T20 tournament which will also involve Bangladesh.
Please Wait while comments are loading...