బ్యాడ్ న్యూస్: టీ20 వరల్డ్ కప్‌ని రద్దు చేసే యోచనలో ఐసీసీ!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 2018లో జ‌ర‌గాల్సిన టీ20 వ‌రల్డ్‌క‌ప్ వాయిదా ప‌డనుంది. 2018లో నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్‌ని రద్దు చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. 2018లో ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు టీ20 లీగ్‌ల కారణంగా పలు దేశాలు బిజీగా ఉన్నందునే టీ20 ప్రపంచకప్‌ టోర్నీని రద్దు చేసినట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి.

ఈ టీ20 వరల్డ్ కప్‌ని 2020లో నిర్వహించే యోచనలో ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. 2020లో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌కు వేదికలు ఇంకా ఖరారు చేయలేదు. రాబోయే టీ20 వరల్డ్ కప్‌ని 2020లో దక్షిణాఫ్రికా లేదా ఆస్ట్రేలియాలో నిర్వహించనున్నట్లు ఐసీసీలోని ఓ సీనియ‌ర్ అధికారి వెల్ల‌డించారు.

 ICC T20 World Cup in 2018

అంతేకాదు ఐసీసీ టోర్నీలు ఎక్కువ అవుతుండ‌టంతో త‌మ‌కు మ‌రింత స‌మ‌యం కావాల‌ని స‌భ్య దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐసీసీ ప్రతినిధులు పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో ఐసీసీ టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్‌లు, టీ20 లీగ్‌లతో 2018 అంతా బిజీగా ఉంది. దీంతో 2018లో నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్‌ని రద్దు చేస్తున్నామని తెలిపారు.

అంతకముందు 2007లో దక్షిణాఫ్రికా, 2009లో ఇంగ్లాండ్, 2010లో వెస్టిండిస్, 2012లో శ్రీలంక, 2014లో బంగ్లాదేశ్, 2016లో భారత్‌ టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ద్వైపాక్షిక సిరీస్‌ల‌తోనే బ్రాడ్‌కాస్ట‌ర్ల‌ను అధిక ఆదాయం వ‌స్తుండ‌టంతో స‌భ్య‌దేశాలు వాటికే మొగ్గు చూపుతున్నాయి.

ముఖ్యంగా ఇండియా ఎక్క‌డికైనా వెళ్తే స‌ద‌రు ఆతిథ్య దేశం బాగా సంపాదిస్తుంది. వ‌చ్చే ఏడాది ఇండియా.. వ‌రుస‌గా సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా టూర్ల‌కు వెళ్ల‌నుంది. 2021లో జరిగే టోర్నీని భారత్‌లో నిర్వహించే అవకాశముంది. ఆ టోర్నీ షెడ్యూల్ ప్ర‌కార‌మే జ‌రుగుతుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The World Twenty20 Championship's seventh edition next year is all set to be scrapped and pushed to 2020 as the top member nations will be busy with bilateral commitments in 2018.
Please Wait while comments are loading...