తెలుగు నేలపై తొలి ఐపీఎల్ ఫైనల్: స్టేడియం లోపలికి వెళ్తే అంతే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పదేళ్ల ఐపీఎల్‌లో తొలిసారి తెలుగు గడ్డపై పైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఐపీఎల్ పదో సీజన్ ఫైనల్ మ్యాచ్‌కి హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు ఫైనల్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.

ఫైనల్ మ్యాచ్‌ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. మే 21న (ఆదివారం) రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం​కానుంది. రూ. 1500, రూ.2000, రూ.4000 టికెట్లు కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నట్టు అధికారిక వెబ్‌సైట్‌ 'బుక్‌మైషో' గురువారం వెల్లడించింది. ఉప్పల్‌లో కనీస టిక్కెట్‌ ధర రూ. 800, అత్యధిక టిక్కెట్‌ ధర రూ. 7500గా నిర్వాహకులు నిర్ణయించారు.

ఈ రెండు విభాగాల్లో టికెట్లు ఇప్పటికే చాలా వరకు అమ్ముడయ్యాయి. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 30వేలు. ఇందులో రెండు వేల సీట్లకు హోర్డింగులు అడ్డు వస్తున్నందున్న రద్దు చేశామని హెచ్‌సీఏ కార్యదర్శి శేష్‌ నారాయణ్‌ తెలిపారు. మిగిలిన 28 వేల సీట్లలో 19 వేల టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడు పోయాయి.

ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటు

ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటు

మిగతా టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని అన్నారు. జింఖానా గ్రౌండ్‌లో కూడా ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు ఫైనల్ మ్యాచ్‌కి తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాచకొండ సీపీ మహేష్ భగవత్ గురువారం మీడియాతో మాట్లాడారు.

తొలిసారి హైదరాబాద్‌లో

తొలిసారి హైదరాబాద్‌లో

తొలిసారి హైదరాబాద్‌‌లో జరుగుతోన్న ఫైనల్ మ్యాచ్‌‌కు 1800 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. స్టేడియం చుట్టూ 88 సీసీ టీవీలు ఏర్పాటు చేశామన్నారు. 'టెక్నాలజీతో భద్రతను పర్యవేక్షిస్తాం. మహిళల భద్రత కోసం ప్రత్యేక షీ టీంలు, యాంటీ ఈవ్ టీజింగ్ టీంలను ఏర్పాటు చేస్తున్నాం' అని తెలిపారు.

సిగరెట్స్, లైట్స్ , వాటర్ బాటిల్స్‌‌కు అనుమతి లేదు

సిగరెట్స్, లైట్స్ , వాటర్ బాటిల్స్‌‌కు అనుమతి లేదు

సిగరెట్స్, లైట్స్, బయట తిను బండారాలు, వాటర్ బాటిల్స్‌‌కు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. చిన్న పిల్లల భద్రతకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామన్నారు. స్టేడియం లోపల తినుబండారాలను నిర్ణయించిన రేట్లకే అమ్మాలని, రేట్ల పర్యవేక్షణకు సూపర్ వైజింగ్ ఉంటోందని హెచ్చరించారు.

ఒక్కసారి లోపలకి వస్తే మ్యాచ్ ముగిసే వరకూ బయటకు వెళ్ళలేరు

ఒక్కసారి లోపలకి వస్తే మ్యాచ్ ముగిసే వరకూ బయటకు వెళ్ళలేరు

ఒక్కసారి లోపలకి వస్తే మ్యాచ్ ముగిసే వరకూ బయటకు వెళ్ళలేరని వీక్షకులకు చెప్పామని అన్నారు. కాగా ఇదివరకు ఇలా లేదు.. మనకు ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు.. బయటికి రావచ్చు కానీ ఇప్పుడు రూల్ మారిందని అన్నారు. ఫైనల్ మ్యాచ్‌‌కు వాహనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

టికెట్స్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు

టికెట్స్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టికెట్స్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగటం లేదని సీపీ స్పష్టం చేశారు. బ్లాక్ టికెట్స్ అమ్మేవారిని నియంత్రించటానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాహనాలు సూచించిన స్థలాల్లోనే పార్క్ చేయాలని తెలిపారు. IPL ఫైనల్ మ్యాచ్ కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపటానికి ముందుకొచ్చిందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Those wanting to watch the final of the Indian Premier League (IPL) 2017) in Hyderabad on May 21 (Sunday), can still buy tickets with just 3 days left for the big day at Rajiv Gandhi International Stadium.
Please Wait while comments are loading...