అమెరికా వేదికగా తొలిసారి: 2018లో మహిళల వరల్డ్ టీ20

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 2018 నవంబర్‌లో మహిళల వరల్డ్ టీ20 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీని వెస్టిండిస్‌తో సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చేందుకు అమెరికా తొలిసారి ముందుకొచ్చింది. ఈ మేరకు ఐసీసీ నిర్వాహకులు తాజాగా వెల్లడించారు.

దీనికి సంబంధించిన వివరాలను ఐసీసీ అమెరికన్స్ డెవలప్మెంట్ మేనేజర్ జానీ గ్రేవ్, క్రికెట్ వెస్టిండిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫరా గోర్సీ వెల్లడించారు. టోర్నీలో భాగంగా వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లను ఫ్లోరిడాలోని లాడెర్‌హిల్‌ మైదానంలో నిర్వహిస్తామని తెలిపారు.

USA could co-host 2018 Women's World T20 with West Indies

ఇదే మైదానంలో గతంలో కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్) నిర్వహించారు. ఈ టోర్నీని తప్పక విజయవంతం చేస్తామని ఫరా గోర్సీ అన్నారు. 'అమెరికాలో ఎంతో మంది మహిళా క్రికెటర్లు ఉన్నారు. యూఎస్‌ఏ పేరుతో జట్టు కూడా ఉంది. అయినప్పటికీ అమెరికాలో క్రికెట్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంది' అని అన్నారు.

ఇందులో భాగంగా తాము వెస్టిండీస్‌తో కలిసి మహిళల వరల్డ్ టీ20 టోర్నీని నిర్వహించాలని భావించామని, జూన్‌లోనే ఐసీసీని సంప్రదింపులు జరిపామని ఫరా అన్నారు. ఇదిలా ఉంటే ఫ్లోరిడాలోని లాడెర్‌హిల్‌ మైదానం 2016లో భారత్‌-వెస్టిండీస్‌‌ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌కి ఆతిథ్యం ఇచ్చింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The United States could co-host the Women's World Twenty20 next November, bringing an ICC global event to America for the first time. Prospects of matches being held at the Lauderhill ground, in Florida, are "well over 50%," according to Fara Gorsi, the ICC Americas development manager.
Please Wait while comments are loading...