న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌పై గెలుపు: అర్ధనగ్నంగా డ్యాన్స్ చేసిన గేల్, బ్రావో

By Nageswara Rao

ముంబై: వెస్టిండిస్ ఆటగాళ్లు డ్వేన్ బ్రావో, క్రిస్‌గేల్ అర్ధనగ్నంగా డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. ఐసీసీ వరల్డ్ టీ20లో భాగంగా ముంబై వాంఖడే మైదానంలో జరిగిన రెండో సెమీ పైనల్ మ్యాచ్‌లో భారత్‌ను చిత్తు చేసి వెస్టిండిస్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఈ నేపథ్యంలో వెస్టిండిస్ జట్టు వరల్డ్ కప్ ఫైనల్‌కు వెళ్లడంతో ఆ జట్టు ఆటగాళ్లు మంచి జోరు మీద ఉన్నారు. సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం వెస్టిండిస్ జట్టు విజయం సాధించడంతో ఆ జట్టు ఆటగాళ్లు వాంఖడే మైదానంలోని డ్రస్సింగ్ రూంలో ఆడి పాడారు. ఈ వీడియోలో విండిస్ జట్టు ఆటగాళ్లు క్రిస్‌గ్రేల్, డ్వేన్ బ్రావోలు హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

చేతులు రెండింటినీ ముందుకు కదుపుతూ ఆడి పాడారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. కాగా ఈ మ్యాచ్‌లో క్రిస్‌గేల్ 5 పరుగులకే ఔట్ అవ్వడం విశేషం. వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి.

వెస్టిండిస్ జట్టు 2012లో వరల్డ్ కప్‌ను కైవసం చేసుకోగా, ఇంగ్లాండ్ జట్టు కూడా 2010లో వరల్డ్ కప్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఇరు జట్లలో ఏ జట్టు గెలిచినా ఆ జట్టు టీ20ల్లో రెండో వరల్డ్ కప్‌ను సాధించిన జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X