ఒంటి చేత్తో సిక్స్‌ బాదిన యువ క్రికెటర్ (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో పలువురు క్రికెటర్లు సత్తా చాటుతూ వెలుగులోకి వస్తున్నారు. తాజాగా కాన్పూర్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒంటి చేత్తో సిక్స్ కొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు.

ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలువైపులా బౌండరీలతో చెలరేగాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ బాదాడు. ఈ భారీ షాట్ ఆడే క్రమంలో అతడు కుడి చేయి బ్యాట్‌పై పట్టుకోల్పోయాడు.

Ishan Kishan's One Handed Six

అయినా సరే బ్యాట్‌ మిడిల్‌లో తాకిన బంతి బౌండరీ లైన్ అవల పడింది. ఇషాన్ కిషన్ ఆ సిక్సర్‌తోనే కేవలం 27 బంతుల్లో ఐపీఎల్‌లో తొలి అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ఇన్నింగ్స్ 13వ ఓవర్‌ వేసిన మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో భారీ షాట్ కోసం ప్రయత్నించి కిషన్ (40 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సులు) అవుటయ్యాడు.

ఓపెనర్లు ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 61; 5x4, 4x6), డ్వేన్‌స్మిత్ (33 బంతుల్లో 54; 7x4, 2x6) అర్ధసెంచరీలతో రాణించడంతో గుజరాత్‌ 19.2 ఓవర్లలో 154 పరుగులు చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Gujarat Lions’ opener batsman Ishan Kishan hits one handed six in today’s game against Sunrisers Hyderabad. Kishan played a brilliant innings, but the team performed so poor after the first wicket.
Please Wait while comments are loading...