వీడియో: పియానో ప్లే చేసిన ధోని కుమార్తె, నెట్‌లో వైరల్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీ పైనల్లో టీమిండియా.. బంగ్లాదేశ్‌తో తలపడుతుంటే ధోని కూతురు జివా మాత్రం తనలోని మ్యూజిక్ టాలెంట్‌ని బయట పెట్టింది. జివా పియానో ప్లే చేస్తున్న‌ప్పుడు వీడియో తీసి త‌న ఇనిస్టాగ్రామ్ ఖాతాలో ధోనీ భార్య సాక్షి పోస్టు చేసింది.

వీటికి సంబంధించి జివా రెండు వీడియోలను పోస్టు చేసింది. త‌న చిట్టి చేతుల‌తో ఎంతో ముద్దుగా పియ‌నో ప్లే చేస్తున్న జివాను నెటిజ‌న్లు ప్ర‌శంసలు కురిపిస్తున్నారు. జివా పియనో ప్లే చేస్తున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది.

Watch MS Dhoni's daughter Ziva playing piano

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా పాకిస్థాన్, దక్షిణాఫ్రికాలపై విజయం సాధించి గురువారం బంగ్లాదేశ్‌తో సెమీ పైనల్ మ్యాచ్‌లో కోహ్లీసేన తలపడింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన విజయం సాధిస్తే ఫైనల్లో తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడుతుంది.

ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ధోని కేవలం ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్‌కు దిగాడు. టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 63 పరుగులతో రాణించాడు.

A post shared by Sakshi (@sakshisingh_r) on Jun 14, 2017 at 11:38am PDT

A post shared by Sakshi (@sakshisingh_r) on Jun 14, 2017 at 11:40am PDT

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Wicketkeeper-batsman and former Indian cricket team skipper MS Dhoni's daughter is winning over the internet after mother Sakshi Singh Rawat posted videos of her playing piano on Instagram.
Please Wait while comments are loading...