రహానే క్లీన్ బౌల్డ్‌: ఐపీఎల్‌లో 100 వికెట్లు తీసిన జహీర్ ఖాన్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా జహీర్ ఖాన్ బౌలింగ్‌లో పదను మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. 38 ఏళ్ల వయసులో కూడా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో జహీర్ ఖాన్ మరో అరుదైన గుర్తింపు పొందాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు  | ఐపీఎల్ పాయింట్ల పట్టిక  | ఐపీఎల్ 2017 ఫోటోలు 

ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జహీర్ ఖాన్ వంద వికెట్లను తీశాడు. ఫిరోజ్ షా కోట్లా వేదికగా శుక్రవారం రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో జహీర్ ఖాన్ ఈ ఘనత సాధించాడు. పూణె ఓపెనర్ రహానేను క్లీన్‌బౌల్డ్‌ చేసి ఐపీఎల్‌‌లో వందో వికెట్‌ మైలురాయిని అందుకున్నాడు.

Vintage Zaheer castles Rahane, completes 100 IPL wickets

ఐపీఎల్, మ్యాచ్ 52: కీలక మ్యాచ్‌లో పూణెపై గెలిచిన ఢిల్లీ

తద్వారా ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన పదో బౌలర్‌గా, 8వ భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు. లలిత్‌ మలింగ(152), అమిత్‌ మిశ్రా(134), హర్భజన్‌ సింగ్‌(127), పియూష్‌ చావ్లా(123), డ్వేన్‌ బ్రావొ(122), భువనేశ్వర్‌ కుమార్‌(108), ఆశిష్‌ నెహ్రా(106), వినయ్‌ కుమార్‌(101), రవిచంద్రన్‌ అశ్విన్‌(100) ఇంతకుముందు ఐపీఎల్‌లో 100 వికెట్ల తీసిన జాబితాలో ఉన్నారు.

ఈ ఐపీఎల్‌ పదో సీజన్‌లో 10 మ్యాచులు ఆడిన జహీర్ ఖాన్ మొత్తం 10 వికెట్లు తీశాడు. భారత్ తరుపున 92 టెస్టు మ్యాచ్‌లు ఆడిన జహీర్‌ఖాన్‌ 32.94 యావరేజితో 311 వికెట్లు తీసుకున్నాడు. ఇక 200 వన్డేలు ఆడి 282 వికెట్లు తీశాడు. 17 టీ20లు ఆడి 17 వికెట్లు తీశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vintage Zaheer castles Rahane, completes 100 IPL wickets.
Please Wait while comments are loading...