అర్చన విజయ జీన్స్ వైపు కోహ్లీ తదేకంగా: నెట్‌లో వైరల్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. కోహ్లీ అసాధారణ ఆటతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలాంటి కోహ్లీకి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ వార్తా, క్రీడా సంస్థలు అతడిని ఇంటర్యూ చేసేందుకు ఆసక్తిని చూపిస్తుంటాయి.

కోహ్లీకి ఇంటర్వ్యూలు కొత్త కాదు. ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి అయిన విరాట్‌ను ఇంటర్వ్యూ చేయడానికి టీవీ కామెంటేటర్ అర్చన విజయ బెంగళూరు జట్టు ప్రాక్టీస్ చేస్తున్న చోటుకు వెళ్లింది. ఆమె కెమెరావైపు చూసి మాట్లాడుతుంటే కోహ్లీ చూపు మాత్రం ఆమె జీన్స్‌పైకి మళ్లాయి.

Virat Kohli caught ogling at IPL host Archana Vijaya's ripped jeans in badly timed photo goes viral

ఆమె పక్కనే కూర్చున్న కోహ్లీ అర్చన వేసుకున్న జీన్స్‌ను తదేకంగా చూడటం మొదలు పెట్టాడు. విరాట్ కోహ్లీ అలా తదేకంగా ఆమె వేసుకున్న జీన్స్‌ను చూస్తున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

గతంలో కోహ్లీ ఎన్నో ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు, ఎప్పుడూ ఇలా ప్రవర్తించిన సందర్భాలు లేవని కొందరు అంటుంటే, అతనికి ఫ్యాషన్ అంటే మక్కువ కాబట్టి చూసి ఉంటాడని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Virat Kohli is unarguably one of the biggest cricketers in the world and is peculiarly known for his excellent timing. This time around the RCB captain became a victim of a badly timed photo that shows him ogling at IPL host Archana Vijaya.
Please Wait while comments are loading...